కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. తాజాగా మరో 240..

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వందకు పైగా నమోదవుతున్నాయి. శనివారం నాడు కొత్తగా మరో 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని..

కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. తాజాగా మరో 240..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2020 | 9:00 PM

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వందకు పైగా నమోదవుతున్నాయి. శనివారం నాడు కొత్తగా మరో 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,129 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 135 హాట్‌ స్పాట్‌లు ఉన్నాయని.. 1.77 లక్షల మందిని అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు.

కాగా, శనివారం నాడు దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నాటికి.. దేశ వ్యాప్తంగా 6,48,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కరో్నా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 3,94,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 442 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి 18,655 మంది మరణించారు.