thanushree datta : హీరోయిన్ గానే కాదు విలన్ గానైనా, వదినగానైనా రెడీ అంటున్న సీనియర్ బ్యూటీ..
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది నటి తనుశ్రీ దత్త. ఈ అమ్మడు అప్పట్లో నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి..

thanushree datta : సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది నటి తనుశ్రీ దత్త. ఈ అమ్మడు అప్పట్లో నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి అలరించింది. ఆతర్వాత టాలీవుడ్ కు చెక్కేసింది. అయితే తనుశ్రీ దత్త క్యాస్టింగ్ కౌచ్ పైన సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోనిలిచింది. దాంతో అక్కడ ఆఫర్లు రాక ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించింది. బాలయ్యతో సినిమా అంటేనే ఒక ఎనర్జీ.. హీరోయిన్లను సినిమాలలో ఎంత ఆటపట్టిస్తారో.. బయట అంత రెస్పెక్ట్ ఇస్తారు అంటుంది తనుశ్రీ దత్త.
తెలుగులో తనుశ్రీ నటించింది ఒకే సినిమాలో..అదే వీరభద్ర. 2005లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నా కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఈ అమ్మడు బాలకృష్ణతో పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంది. ఇప్పుడు తనుశ్రీ మళ్లీ నటన వైపు చూస్తుంది. తనకు హీరోయిన్ పాత్రలే రావాలని అనుకోవడం లేదని.. ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేస్తానని చెప్తుంది ఈ సీనియర్ బ్యూటీ.బాలీవుడ్ కంటే కంటెంట్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా బెటర్ అంటోంది. ఇక తనకు పాపులారిటీ తెచ్చింది కూడా తెలుగు సినిమానే అంటోంది. బాలయ్యతో సినిమా చేసేటప్పుడు చాలా లావయ్యానని, వీరభద్ర సినిమా టైంలో రోజు బాలయ్య ఇంటి భోజనం వచ్చేదని అది తినే నేను 5కిలోల బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో హీరోయిన్ అవకాశాలేకాకుండా విలన్, అక్క, వదిన పాత్రలైన సరే చేస్తానంటుంది తనుశ్రీ. మరి ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి.
also read :