శ్రావణి ఆత్మహత్య కేసు.. ఇద్దరు అరెస్ట్..
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆమె చావుకు కారకులుగా భావిస్తున్న సాయికృష్ణ, దేవరాజ్‌రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు.
Actress Sravani Case: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆమె చావుకు కారకులుగా భావిస్తున్న సాయికృష్ణ, దేవరాజ్‌రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A 1 గా సాయికృష్ణారెడ్డి, A2గా దేవరాజ్ రెడ్డిని చేర్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఇటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డికి కూడా పోలీసులు నోటీసులిచ్చారు. శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు అశోక్‌రెడ్డిని కూడా విచారించనున్నారు. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా అశోక్‌రెడ్డికి నోటీసులిచ్చారు.
Also Read:
”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”