ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు... వివరాలివే
Follow us

|

Updated on: Sep 12, 2020 | 2:25 PM

NEET Exam: వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గూడూరు-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.

గూడూరు-విజయవాడ(07631-07632)… ఇవాళ రాత్రి 8 గంటలకు గూడూరు నుంచి బయల్దేరనున్న రైలు.. రేపు ఉదయం 4.30కి విజయవాడ చేరుకుంటుంది. అలాగే విజయవాడలో రేపు రాత్రి 8 గంటలకు బయల్దేరి.. సోమవారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు గూడూరు చేరుతుంది. ఈ రైలు నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు స్టేషన్లలో ఆగనుంది.

విజయవాడ-విశాఖపట్నం(07433-07434)… విజయవాడలో ఇవాళ రాత్రి 11 గంటలకు బయల్దేరనున్న రైలు.. రేపు ఉదయం 5.20 నిమిషాలకు విశాఖపట్నం చేరుతుంది. అలాగే ఆదివారం రాత్రి 9.30 గంటలకు విశాఖలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుకుంటుంది. నూజివీడు, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

Latest Articles