మీ జుట్టు తెల్లబడుతుందా? బీకేర్ ఫుల్.. హార్ట్‌ రిస్క్‌ ఉన్నట్టే!

April 30, 2024

TV9 Telugu

ఒకప్పుడు తల నెరిస్తే వయసు మీద పడుతుందని అనుకునే వారు. కానీ ఇప్పుడు 30 యేళ్లు రాకముందే తల నిండా తెల్ల వెంట్రుకలు పలకరిస్తున్నాయి. దీంతో వీటిని దాచడానికి పడే పాట్లు ఉంటాయి చూడండీ..

కనీసం 40 యేళ్లు కూడా రాకముందే జుట్టు తెల్లబడటం నేటి కాలంలో సర్వసాధారణం అయిపోయింది. పాతికేళ్లకే జుట్టు నెరిసిపోతుంది. చాలామంది దీన్ని చిన్న విషయంగా పరిగణిస్తుంటారు

కానీ చిన్న వయసులో జుట్టు నెరవడం కాస్మొటిక్‌ అంశంగా నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అకాలంగా జుట్టు నెరవడం హృద్రోగానికి సంకేతమని చెబుతున్నారు

ఈజిప్ట్‌లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 545 మందిని ఎంపిక చేశారు. వాళ్ల ఆరోగ్యం, జుట్టు రంగు ఆధారంగా పరిశీలించారు

అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పదేళ్ల పాటు వీళ్లను గమనించగా తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్టు కనుగొన్నారు

జుట్టు నల్లగా ఉన్నవాళ్లలో ఇలాంటి సమస్యలు అరుదుగా కనిపించాయి. దాదాపు 80 శాతం మందిలో గుండె సంబంధిత వ్యాధుల సంకేతాలు ఉన్నాయని, వారందరికీ తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నట్లు వీరి పరిశోధనలో తేలింది

సెల్యులార్ క్షీణత, హార్మోన్ల మార్పులు, బలహీనమైన DNA పనితీరు వల్ల అకాల వృద్ధాప్యం సంభవిస్తుంది. ఈ విధమైన వృద్ధాప్యం గుండె జబ్బుల హానిని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

తెల్లజుట్టు ఉన్నవాళ్లకు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇలాంటి వాళ్లు కొలెస్ట్రాల్‌ పరీక్షలు ముందుగా చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది