Ram Charan vs Allu Arjun: చరణ్‌ బంపర్‌ ఛాన్స్‌ను కొట్టేసిన ఐకాన్ స్టార్..

Ram Charan vs Allu Arjun: చరణ్‌ బంపర్‌ ఛాన్స్‌ను కొట్టేసిన ఐకాన్ స్టార్..

Anil kumar poka

|

Updated on: Apr 30, 2024 | 11:16 AM

మెగా కంపౌండ్ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇప్పుడు వీరిద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. భారీ బడ్జెట్ చిత్రాలతో ఇప్పుడు ఇద్దరూ బిజీగా ఉన్నారు. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు రామ్ చరణ్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు.

మెగా కంపౌండ్ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇప్పుడు వీరిద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. భారీ బడ్జెట్ చిత్రాలతో ఇప్పుడు ఇద్దరూ బిజీగా ఉన్నారు. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు రామ్ చరణ్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు. ఆ సినిమా బన్నీ కెరీర్ లో చాలా ప్రత్యేకం. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ది జరిగింది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?.. అదే గంగోత్రి.

ఇక గంగోత్రి సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బన్నీ కంటే ముందు చరణ్ ను సంప్రదించింది చిత్రయూనిట్. అయితే చరణ్ నటనలో పరిణితి పొందేందుకు ఇంకా సమయం పడుతుందని.. తను ఇంకా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చిరు అన్నారు. ఆ మూవీ కోసం బన్నీ బాగుంటాడని.. తనతో సినిమా చేయాలని కోరారట చిరు. దీంతో చరణ్ కాకుండా బన్నీని సంప్రదించింది చిత్రయూనిట్. అలా గంగోత్రి సినిమాతో చరణ్ కంటే ముందే హీరోగా సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు అల్లు అర్జున్. ఈ మూవీలో బన్నీ నటనకు ప్రశంసలు వచ్చాయి. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు బన్నీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.