”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఏపీలో కలకలం రేపుతున్న అంతర్వేది రధం తగలబడిన ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Ravi Kiran
  • Publish Date - 6:49 pm, Fri, 11 September 20

YSRCP MLA Roja Comments: ఏపీలో కలకలం రేపుతున్న అంతర్వేది రధం తగలబడిన ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది రథం తగలబడిన ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు.

గతంలో తుని రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టిన ఘనత చంద్రబాబుదేనంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. సీబీఐని రాష్ట్రానికి రావొద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు..నేడు సీబీఐ విచారణ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ”చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు సీఎం జగన్‌ ఆదేశించారని” రోజా స్పష్టం చేశారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..