ANIL KUMAR

ఊరికే రాలేదు.. అంత ఈజీ కాదు.! తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు.

30 April 2024

హీరోయిన్ తాప్సీ పన్ను ఈ మధ్యకాలంలోనే మథియాస్ బోయ్‏తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

వీరి పెళ్లి చాలా సింపుల్‏గా జరిగింది. తాప్సీ పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ గానీ.. అధికారిక ప్రకటన గానీ రాలేదు.

కానీ కొన్నిరోజుల క్రితం తాప్సీ పెళ్లి వీడియో నెట్టింట వైరలవడంతో వీరిద్ధరి పెళ్లిపై స్పష్టత వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ తన పెళ్లి గురించి అండ్ తన కెరియర్ సక్సెస్ గురించి రియాక్ట్ అయ్యింది.

తాజాగా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో సక్సెస్‌ జస్ట్ అలా వచ్చేయలేదని.. సక్సెస్ పూల పాన్పు కాదని అన్నారు తాప్సీ.

ఇప్పుడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే, కాసేపు తీరిగ్గా కూర్చుని రిలాక్స్ కావాలని అనిపిస్తోందని అన్నారు.

తన మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా తాను పలు రకాల జోనర్లలో సినిమాలు చేశానని, అందులో నటించడం కష్టమేనని..

ఉన్న కొద్దీ అవకాశాల్లో అంత వైవిధ్యమున్న పాత్రలను ఎంపిక చేసుకోవడం కూడా చాలా కష్టమని అన్నారు హీరోయిన్ తాప్సీ.