AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్ తో అలీ భేటీ, దేశంలోనే బెస్ట్ సీఎం అంటూ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రముఖ కమెడియన్ అలీ బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగానే వీరి భేటీ సాగినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ తో అలీ భేటీ, దేశంలోనే బెస్ట్ సీఎం అంటూ..
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2020 | 5:37 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రముఖ కమెడియన్ అలీ బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగానే వీరి భేటీ సాగినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో అలీ ముచ్చటించారు. మర్యాద పూర్వకంగానే తమ నాయకుడిని కలిశానని, కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారని తెలిపారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పినట్లు వివరించారు. చిన్న వయసులో జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని అలీ ప్రశంసించారు.  మంచి చేస్తున్నా కూడా విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారని, ఆయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో అలా మాట్లాడతున్నారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎం జగన్ అని అలీ స్పష్టం చేశారు.

2019 ఎన్నికలకు ముందు అలీ.. వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ప్రచారం చేశారు. అతి త్వరలోనే సీఎం జగన్ అలీకి మంచి పదవి ఇవ్వబోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also Read :

ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!

బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?