Breaking : అచ్చెన్నాయుడి రిమాండ్ జులై 10 వరకు పొడిగింపు..
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అవకతవకలకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో అవినీతి నిరోధక శాఖ విచారణ ముగిసింది. గుంటూరు జీజీహెచ్‌లో ఇవాళ మొత్తం మూడున్నర గంటల పాటు విచారించారు అధికారులు.
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అవకతవకలకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో అవినీతి నిరోధక శాఖ విచారణ ముగిసింది. గుంటూరు జీజీహెచ్‌లో ఇవాళ మొత్తం మూడున్నర గంటల పాటు విచారించారు అధికారులు. మూడు రోజుల్లో కలిపి పదకొండున్నర గంటల పాటు అచ్చెన్నాయుడు విచారణ సాగింది. ముఖ్యంగా ఈఎస్‌ఐ టెలీ హెల్త్ సర్వీసెస్ కు సంబంధించి టెండర్లపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన సిఫార్సు లేఖపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. అయితే అచ్చెన్నాయుడు విచారణ సమయంలో మనసు విప్పి మాట్లాడటం లేదని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అచ్చెన్నాయుడు రిమాండ్ గడువు జులై 10 వరకు పొడిగించింది న్యాయస్థానం. జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడిని ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఆపరేషన్ గాయం నుంచి అచ్చెన్నాయుడు దాదాపు కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.