టర్కీలో ఆమిర్ ఖాన్ మూవీ షూటింగ్, అభిమానుల కోలాహలం

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ ఛాద్ధా' మూవీ షూటింగ్ టర్కీలో మొదలైంది. మాస్క్ ధరించిన ఆమిర్ ఖాన్ ను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు...

టర్కీలో ఆమిర్ ఖాన్ మూవీ షూటింగ్, అభిమానుల కోలాహలం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 13, 2020 | 9:20 AM

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ ఛాద్ధా’ మూవీ షూటింగ్ టర్కీలో మొదలైంది. మాస్క్ ధరించిన ఆమిర్ ఖాన్ ను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో తన కారువద్దకు చేరుకునేందుకు ఆయన ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన ఫాన్స్ ఈ వీడియోలను షేర్ చేశారు. 1994 నాటి హాలీవుడ్ చిత్రం’ ఫారెస్ట్ గంప్’ కి ఈ చిత్రం రీమేక్.. అందులో టామ్ హాంక్స్ నటించారు. నిజానికి ఆమిర్ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కు విడుదల కావలసి ఉంది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్రంలో అమిర్ సరసన కరీనా కపూర్, మోనా సింగ్ నటిస్తున్నట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

అంతర్జాతీయ లొకేషన్ లో షూటింగ్ జరుగుతున్న రెండో సినిమా ఇది.. మొదట అక్షయ్ కుమార్ మూవీ..’బెల్ బాటమ్’ షూటింగ్ లండన్ లో జరిగింది.