అత్తాకోడళ్ల మధ్య వివాదం..కోపంతో అత్త ముక్కు కొరికిన కోడలు..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
జోగులంబ గద్వాల జిల్లాలో ఓ కోడలు అత్త ముక్కుమీద ప్రతాపం చూపింది. మాటలు, చేతులతో కాకుండా.. ఏకంగా నోటికే పని చెప్పింది. అత్త మందలించిందనే కోపంతో ఆమె ముక్కును కొరికేసింది.
జోగులంబ గద్వాల జిల్లాలో ఓ కోడలు అత్త ముక్కుమీద ప్రతాపం చూపింది. మాటలు, చేతులతో కాకుండా.. ఏకంగా నోటికే పని చెప్పింది. అత్త మందలించిందనే కోపంతో ఆమె ముక్కును కొరికేసింది. వివరాల్లోకివ వెళ్తే.. జిల్లాలోని మానవపాడు మండలం కేంద్రంలో నివశించే శారదమ్మకు ముగ్గురు కొడుకులు. అయితే శారదమ్మ మాత్రం తన చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. ఇంట్లో అత్త ఉండటం కోడలికి ఇష్టం లేదు. దాంతో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ సోమవారం రాత్రి కూడా అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. అయితే పరిస్థితి ఈసారి అదుపు తప్పింది. తీవ్ర కోపంతో ఊగిపోయిన కోడలు అత్త శారదమ్మ ముక్కును ఒక్కసారిగా కొరికింది. ఊహించని పరిణామంతో శారదమ్మ ఒక్కసారిగా కంగుతింది. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కోడలిపై ఫిర్యాదు చేసింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది.
Also Read :
Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?
Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు