పక్షి చేసిన పనికి ఖంగుతిన్న యువతి.. పాపం వెంటపడిన ఆగలేదుగా.. ఇంతకీ పక్షి ఏం చేసిందో తెలుసా..

కొన్ని సార్లు జంతువులు పక్షులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇక అవి చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Rajitha Chanti
  • Publish Date - 6:16 am, Fri, 16 April 21
పక్షి చేసిన పనికి ఖంగుతిన్న యువతి.. పాపం వెంటపడిన ఆగలేదుగా.. ఇంతకీ పక్షి ఏం చేసిందో తెలుసా..
Viral Video

కొన్ని సార్లు జంతువులు పక్షులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇక అవి చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మరికొన్ని సందర్బాల్లో అవి చేసే పనుల వలన తల పట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు.. చేతిలోని వస్తువులను అమాంతం లాగేసుకోని పారిపోతుంటాయి. ఇదిలా ఉంటే ఇటీవల జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ పక్షి చేసిన పని నవ్వులు పూయిస్తుంది.

ఆ వీడియోలో టెర్రస్ పైన ఉన్న ఓ అమ్మాయి… తన మొబైల్ ఫోన్‏ను పక్కన పెట్టి కుర్చుంది. ఆకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పక్షి.. ఆ అమ్మాయి మొబైల్ ను తన నోట కరచుకొని అమాంతం ఎగిరిపోయింది. ఇది గమనించిన ఆ యువతి అరుస్తూ.. ఆ పక్షి వెంట పరుగులూ తీసింది. ఇక ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. మరీ మీరు ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి..

వీడియో..

Also Read: అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..