Gold Price Today: ఈ నెలలో రూ.2,940 పెరిగిన బంగారం ధర.. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Gold Price Today: బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఒక రోజు తగ్గినా.. మరో రోజు పెరగవచ్చు. ఏప్రిల్ నెలలో వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి....
Gold Price Today: బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఒక రోజు తగ్గినా.. మరో రోజు పెరగవచ్చు. ఏప్రిల్ నెలలో వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న పెరుగగా, తాజాగా శుక్రవారం స్వల్పంగా తగ్గింది. తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,030 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,630 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 వద్ద కొనసాగుతోంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 వద్ద ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 ఉంది. ఏపిలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,670 ఉంది.
కాగా, దాదాపు ఈ నెలలో 14 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2,330 వరకు పెరిగింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,540 వరకు పెరిగింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ వస్తే… బంగారం ధరలు మరింత పడిపోతాయేమో అనే భయాలతో కొంత మంది ఇన్వెస్టర్లు… పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో నిన్నటి బంగారం ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. అయితే దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు కరోనా ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో గమనించి కొనుగోలు చేయాలని బంగారం ప్రియులకు సూచిస్తున్నారు.