Campus Placements: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టిన CA విద్యార్ధులు.. ఏకంగా 8 వేల మందికి అత్యధిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్స్
ICAI సీఏ విద్యార్థులు ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటారు. ఏకంగా 8 వేల మంది వివిధ కంపెనీల్లో అత్యధిక వార్షిక వేతనంతో కొలువులు దక్కించుకున్నారు. ప్రతీయేట సాధారణంగా 150కి మించని కంపెనీలు ఈ ఏడాది దాదాపు 241 కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో పాల్గొన్నాయని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు..
హైదరాబాద్, జనవరి 1: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సీఏ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏకంగా 8వేల మందికి పైగా విద్యార్థులు కొలువులు దక్కించుకున్నారు. మొత్తం రెండు వితగలుగా ఈ ప్లేస్‌మెంట్ సైకిల్ నడిచింది. నవంబర్ 2023, మే 2024 పరీక్షల్లో కొత్తగా అర్హత పొందిన CAల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించారు. ఫిబ్రవరి-మార్చి 2024లో జరిగిన 59వ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 140 కంపెనీలు పాల్గొనగా 3,002 మంది అభ్యర్థులు కొలువులు సాధించారు. మే-జూన్‌లో జరిగిన 60వ ప్రోగ్రామ్‌లో 4,782 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 241 కంపెనీలు ఈ సెలక్షన్ ప్రోగ్రామ్ చేపట్టాయి. ఐసీఏఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో 4782మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు. జాబ్ మార్కెట్లో సీఏలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.
ఎంపికైన విద్యార్ధుల్లో రూ. 29 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో డియాజియో ఇండియా నుంచి జాబ్ ఆఫర్‌ను అందుకున్నారు. ఆ తర్వాత రూ.26.70 లక్షల వేతనంతో ఎల్‌పీఏ కంపెనీ అత్యధిక ప్యాకేజీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే సగటు వేతనం మాత్రం రూ. 13.24 లక్షల వార్షిక వేతనం నుంచి రూ. 12.49 లక్షల వార్షిక వేతనానికి స్వల్పంగా తగ్గిందని ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు తొమ్మిది ప్రధాన నగరాలతో పాటు 20 చిన్న చిన్న నగరాల్లోనూ ఈ డ్రైవ్‌లు నిర్వహించారు.
Matter for Press :
As Chairman of the Committee for Members in Industry & Business (CMIB) of ICAI, I am delighted to announce the resounding success of the 60th Campus Placement Programme. This year has been a landmark achievement, witnessing the highest-ever participation of…
— DHIRAJ KHANDELWAL (@kdhiraj123) December 28, 2024
సాధారణంగా 150 కంపెనీలే పాల్గొంటుండేవని అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది మాత్రం అత్యధికంగా కంపెనీలు పాల్గొనడం విశేషం. మరోవైపు, వచ్చే ఏడాది జనవరి 24-25 తేదీల్లో ఓవర్సీస్ ప్లేస్‌మెంట్స్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఐసీఏఐ ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈ, ఆసియా, యూరప్ సహా పలు దేశాలకు సీఏలను పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది సభ్యులు, దాదాపు 9,85,000 మంది విద్యార్థులతో ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, US వంటి ప్రాంతాలలో ICAI 52 విదేశీ అధ్యాయాలను కలిగి ఉంది. భారతీయ CAలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేలా చేయడమే ఐసీఏఐ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది.