తెలంగాణలో ఆందోళ‌న‌క‌రంగా క‌రోనా..తాజాగా 66 కొత్త కేసులు

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: May 25, 2020 | 11:20 PM

గత కొద్ది రోజులుగా తెలంగాణలో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. తాజాగా న‌మోద‌వుతోన్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం (మే 25) క‌రోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించింది. తాజా కేసులతో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1920కి చేరుకుంది. కరోనాతో సోమవారం మరో ముగ్గురు చ‌నిపోయిన‌ట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో […]

తెలంగాణలో ఆందోళ‌న‌క‌రంగా క‌రోనా..తాజాగా 66 కొత్త కేసులు

గత కొద్ది రోజులుగా తెలంగాణలో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. తాజాగా న‌మోద‌వుతోన్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం (మే 25) క‌రోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించింది. తాజా కేసులతో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1920కి చేరుకుంది. కరోనాతో సోమవారం మరో ముగ్గురు చ‌నిపోయిన‌ట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 56కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 కేసులు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. మొత్తం 66 కేసుల్లో 32 మంది తెలంగాణకు చెందినవారని మిగిలిన వారంతా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వార‌ని హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించారు. బాధితుల్లో 18 మంది ఫారెనర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. 18 మంది వలస కూలీలు, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వివ‌రించారు. సోమవారం కరోనా నుంచి కోలుకొని 72 మంది డిశ్చార్జ్ అవడం కాస్త కుద‌ట‌ప‌డే విష‌యం. దీంతో వ్యాధి న‌య‌మై డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1164కు చేరుకుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu