అప్పట్లో ఆరుసార్లు సర్జికల్ దాడులు చేశాం.. తేదీలు కూడా ఇవే..
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ ఆరుసార్లు చేశామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అంతేకాదు ఏ రోజున ఎక్కడెక్కడ దాడులు చేశామో.. తేదీలతో సహా వెల్లడించింది. ఆ దాడులకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజీవ్ శుక్లా వెల్లడించారు. 2008, జూన్ 19వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని బత్తల్ సెక్టార్‌లో మొదటిసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు ఆయన తెలిపారు. 2011, సెప్టెంబర్ ఒకటవ తేదీన నీలమ్ నది లోయలో రెండవసారి సర్జికల్ దాడి జరిగిందని.. […]

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ ఆరుసార్లు చేశామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అంతేకాదు ఏ రోజున ఎక్కడెక్కడ దాడులు చేశామో.. తేదీలతో సహా వెల్లడించింది. ఆ దాడులకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజీవ్ శుక్లా వెల్లడించారు. 2008, జూన్ 19వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని బత్తల్ సెక్టార్‌లో మొదటిసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు ఆయన తెలిపారు. 2011, సెప్టెంబర్ ఒకటవ తేదీన నీలమ్ నది లోయలో రెండవసారి సర్జికల్ దాడి జరిగిందని.. ఆ తర్వాత 2013, జనవరి 6వ తేదీన సావన్ పత్రా చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 28వ తేదీన నజాపిర్ సెక్టార్‌లో, 2013 ఆగస్టు 6వ తేదీన నీలం వ్యాలీలో, 2014 జనవరి 14న మరోచోట సర్జికల్ దాడులు జరిగినట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.



