యూపీలో పేలుళ్లు జరిగే అవకాశం.. ఐబీ అలర్ట్

మొన్న ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో జరిగిన మారణ హోమం తలచుకుంటేనే.. ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. గంటల వ్యవధిలో మనుషులను మాంసపు ముద్ధలుగా చేసిన ఆ ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో భారత్ అప్రమత్తమైంది. మరోపక్క నిన్ననే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై పేలుళ్లు జరపడంతో 16మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. దీంతో భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెంచింది. గడ్చిరోలిలో జరిగిన ఘటనపై క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో బాంబు పేలుళ్లు జరిగే […]

యూపీలో పేలుళ్లు జరిగే అవకాశం.. ఐబీ అలర్ట్
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 7:18 PM

మొన్న ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో జరిగిన మారణ హోమం తలచుకుంటేనే.. ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. గంటల వ్యవధిలో మనుషులను మాంసపు ముద్ధలుగా చేసిన ఆ ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో భారత్ అప్రమత్తమైంది. మరోపక్క నిన్ననే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై పేలుళ్లు జరపడంతో 16మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. దీంతో భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెంచింది. గడ్చిరోలిలో జరిగిన ఘటనపై క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని హెచ్చరించింది. యూపీలోని చందౌలీ, మిర్జాపూర్, సోన్‌భద్రా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరగొచ్చని, దీనిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.