పాక్ వక్రబుద్ధి.. బాలాకోట్ ఘటన తర్వాత 513 సార్లు కాల్పులు

జమ్ముకశ్మీర్ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పాక్‌‌ 513 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ ఈ నెలన్నర రోజులుగా 513 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. 100 సార్లకు పైగా భారీ ఆయుధాలను భారత్ పైకి వినియోగించిందన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం […]

పాక్ వక్రబుద్ధి.. బాలాకోట్ ఘటన తర్వాత 513 సార్లు కాల్పులు

జమ్ముకశ్మీర్ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పాక్‌‌ 513 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ ఈ నెలన్నర రోజులుగా 513 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. 100 సార్లకు పైగా భారీ ఆయుధాలను భారత్ పైకి వినియోగించిందన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పాక్‌ ఇటువంటి చర్యలకు పాల్పడిన ప్రతిసారి మేము వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని.. కాల్పుల్లో భారత ఆర్మీకి జరిగిన నష్టం కన్నా పాక్‌ దాదాపు ఐదింతలు మూల్యం చెల్లించుకుంది అని ఆర్మీ అధికారులు తెలిపారు.

కాగా, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అదే నెల 26న భారత వైమానిక దళం బాలాకోట్‌లోకి ప్రవేశించి జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆ తర్వాతి రోజు నుంచి పాక్‌ రెచ్చగొట్టే చర్యలను మరింత పెంచింది. భారత గగనతలానికి దగ్గరగా పలుమార్లు యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టింది. రాజౌరీ, నౌషెరా, పూంచ్ సెక్టార్లలో పాక్‌ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది.

Published On - 9:41 pm, Sun, 14 April 19

Click on your DTH Provider to Add TV9 Telugu