AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multan Sun Temple: కృష్ణుడు కొడుకు సాంబుడు నిర్మించిన పాక్‌లోని ముల్తానా సూర్య దేవాలయం.. విశిష్టత ఏమిటంటే..!

ప్రముఖ హిందూ దేవాలయాలు పాక్ భూమిలో ఉండిపోయాయి. అలా కోల్పోయిన ప్రసిద్ధి దేవాలయంలో ఒకటి శ్రీ కృష్ణుడు కుమారుడు నిర్మించినట్లు చెబుతున్న ముల్తానాలోని సూర్యదేవాలయం. ఈ ఆలయం విశిష్టత...

Multan Sun Temple: కృష్ణుడు కొడుకు సాంబుడు నిర్మించిన పాక్‌లోని ముల్తానా సూర్య దేవాలయం.. విశిష్టత ఏమిటంటే..!
Surya Kala
|

Updated on: Feb 19, 2021 | 3:15 PM

Share

Multan Sun Temple: ఈరోజు శ్రీ సూర్యనారాయణ మూర్తి జన్మదినం. మనదేశంలోని సూర్యదేవాలయాలతో పాటు ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అఖండ భారత దేశాన్ని బ్రిటిష్ వారు పాకిస్థాన్, భారత్ లు విడదీశారు. ఈ సమయంలో అనేక ప్రముఖ హిందూ దేవాలయాలు పాక్ భూమిలో ఉండిపోయాయి. అలా కోల్పోయిన ప్రసిద్ధి దేవాలయంలో ఒకటి శ్రీ కృష్ణుడు కుమారుడు నిర్మించినట్లు చెబుతున్న ముల్తానాలోని సూర్యదేవాలయం. ఈ ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం..!

హైందవమతంలో సూర్యారాధనకి అత్యంత ప్రాధాన్యత ఉంది. నిత్యం జపించే గాయత్రి మంత్రం సైతం సూర్యుని స్తుతించే మంత్రమే అన్న వాదనలు కూడా ఉన్నాయి. అటువంటి లోకబాంధవుడిని కొలవడానికి అఖండ దేశంలో అనేక దేవాలయాలను నిర్మించారు. అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం! దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట. ఆ ఆలయాన్ని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట. అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు. క్రమేపీ ఆ పేరు ‘ముల్తాన్’గా మారిపోయింది.

ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని, కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రజలంతా కూడా తమ రోగాలు, కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు. అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు. ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు. అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది.

అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు, తలుపులు, స్తంభాలు, శిఖరాలు… అన్నీ కూడా వెండి, బంగారాలతో ధగధగలాడిపోతుండేవని తెలుస్తోంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి. ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలయినా కూడా ఆలయ ప్రాశస్యం ఏమాత్రం తగ్గలేదు. కాలక్రమంలో పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు. పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు. ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు.

ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది. అదే నరసింహస్వామి ఆలయం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ ఊరికి హిరణ్యకశిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉంది. హిరణ్యకశిపుని వధ తర్వాత, స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరిమూకలు ధ్వంసం చేస్తూ వచ్చాయి. అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు. 1992లో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు నిరసనగా, ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు. ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి అంతే కాదు ఈ ఆలయం నుండే ముల్తానీ మట్టి వచ్చేది..అని తెలుస్తోంది

Also Read:

అమెరికాలో ఉన్న భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. వేలాది మందికి మేలు చేయనున్న కొత్త చట్టం..

23 శాతం ఓటింగ్ సాధించాం.. నాలుగో దశలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి, లెక్కలను అంకెలతో సహా వివరించిన జనసేనాని