Hydrogen Fuel Car: త్వరలోనే మార్కెట్లోకి రానున్న హైడ్రోజన్‌ కార్లు.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభం

Hydrogen Fuel Car: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్‌ గత కొంత కాలంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ...

Hydrogen Fuel Car: త్వరలోనే మార్కెట్లోకి రానున్న హైడ్రోజన్‌ కార్లు.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభం
Follow us

|

Updated on: Feb 19, 2021 | 3:11 PM

Hydrogen Fuel Car: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్‌ గత కొంత కాలంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై రాయితీ కూడా ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా పర్యావరణానికి హాని జరుగుతుండటంతో భవిష్యత్తులో వీటి వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆటో మొబైల్‌ కంపెనీలు కూడా ఎకక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు దృష్టి సారించాయి. ఈ కార్లకు ఫుల్‌ ఛార్జ్‌ చేయడానికి సుమారు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. అయితే సమస్యకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్‌ గ్యాస్‌తో ఛార్జ్‌ చేసి నడపనున్నారు. ఇలా చేయడం వల్ల కారులో విద్యుత్‌ ఉత్పత్తి అవ్వడమే కాకుండా కేవలం నీరు, వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్దతిలో వాహనాలను నడపవచ్చు.

రెగ్యులర్‌ బ్యాటరీ వెహికల్స్‌ కంటే వీటికి అనేక ప్రయోజనాలుంటాయి. వాతావరణంలో విరివిగా లభించే హైడ్రోజన్‌ గ్యాస్‌ వాడకం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడవచ్చు. అంతేకాకుండా పెట్రోల్‌, డీజిల్‌ వాడకాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. వాహనాల్లో ఎలాగైతే పెట్రోల్‌ నింపుతామో అదే విధంగా క్షణాల్లో హైడ్రోజన్‌ తో కారు ఇంధనాన్ని నింపేయవచ్చు. హైడ్రోజన్‌ వాయువుపై పరిశోధన, అభివృద్ధిలో భాగంగా యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ 100 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్న నాలుగు నెలల్లో భారత్‌ నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ప్రకటించడం విశేషం.

ఢిల్లీలో పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం

కాగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్‌ ద్వారా హైడ్రోజన్‌ను ఇంధన వనరుగా ఎలా ఉపయోగించాలనే దానిపై రోడ్‌ మ్యాప్‌ రచిస్తోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌తో పెట్రోల్‌, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించడం, పర్యావరణాన్ని కాపాడటం వంటి ప్రయోజనాలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్టును ఢిల్లీలో గతంలోనే ప్రారంభించారు. ఆరు నెలల కిందట ఢిల్లీ నగరంలో హైడ్రోజన్‌ స్పైక్డ్‌ కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ పై నడిచే వాహనాలను ప్రారంభించింది. దీంతో హైడ్రోజన్‌ గ్యాస్‌తో వాహనాలను నడుపుతున్నట్లు మొట్టమొదటి భారతీయ నగరంలో ఢిల్లీ నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి లిమిటెడ్‌ కూడా లేమ్‌, ఢిల్లీలో 10 హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు, ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఫరీదాబాద్‌లోని తన ఆర్‌అండ్‌డి కేంద్రంలో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Also Read:

Hyundai electric car: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టిన హ్యుండాయ్‌.. కొత్త కారు టీజర్‌ చూశారా..?

SBI Annuity Scheme: ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 10,000 పొందవచ్చు