ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదురుగు మావోయిస్టులు మ‌ృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కి 20 కిలో మీటర్ల దూరంలోని మావోయిస్టుల మిలిటరీ క్యాంపు ఉందన్న సమాచారంతో ఎస్పీ మోహిత్‌గార్గ్ నేతృత్వంలో రిజర్వ్ గార్డ్ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో గుమర్క – దుర్బేడ గ్రామాల వద్ద భద్రతా బలగాలకు తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:25 pm, Sat, 24 August 19
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్... ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదురుగు మావోయిస్టులు మ‌ృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కి 20 కిలో మీటర్ల దూరంలోని మావోయిస్టుల మిలిటరీ క్యాంపు ఉందన్న సమాచారంతో ఎస్పీ మోహిత్‌గార్గ్ నేతృత్వంలో రిజర్వ్ గార్డ్ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో గుమర్క – దుర్బేడ గ్రామాల వద్ద భద్రతా బలగాలకు తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నర పాటు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా గుర్తించారు. అదేవిధంగా భద్రతా బలగాలకు సంబంధించిన ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు. మ‌ృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలన నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు.