ఘోర ప్రమాదం.. 300 మీటర్ల లోతు నాలాలో పడ్డ కారు.. ఐదుగురు మృతి..

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రగ్గీ నాలా వద్ద ఓ కారు అదుపుతప్పి మూడు వందల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

  • Tv9 Telugu
  • Publish Date - 1:08 pm, Sat, 27 June 20
ఘోర ప్రమాదం.. 300 మీటర్ల లోతు నాలాలో పడ్డ కారు.. ఐదుగురు మృతి..

లోయ ప్రాంతాల్లో అత్యంత నెమ్మదిగా వెళ్లాలంటూ సైన్ బోర్డులు పెడుతుంటారు. కానీ వాహనదారులు అవన్నీ పట్టించుకోరు. ఏమవుతుందిలే అంటూ వారు వెళ్లే వేగంతోనే వెళ్తుంటారు. అదుపుతప్పి ప్రమాదాల బారినపడుతూ.. ప్రాణాలనే కోల్పోతుంటారు. ఇందులో కొన్ని డ్రైవర్ల తప్పిదం వల్ల జరిగితే.. మరికొన్ని రోడ్లు సరిగ్గా లేక జరుగుతుంటాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దోడా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రగ్గీ నాలా వద్ద అదుపుతప్పి ఓ కారు అందులో పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు జలసమాధి అయ్యారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతోనే నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ నాలలో వాహనాలు పడిపోకుండా.. బారికేడ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం కూడా ఇదే ప్రాంతంలో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని.. ఈ ఘటనల్లో 20 మంది వరకు చనిపోయారని తెలిపారు.