5

తెలంగాణలో ఒకేరోజు ఇద్దరు మృతి..కొత్త‌గా 41 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 41 కేసులు న‌మోదయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ 1367కు చేరుకున్నాయి. బుధవారం కరోనా వల్ల మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఈ మ‌హమ్మారి వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 34కు చేరింది. అయితే, వ్యాధి నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 117 అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 394 […]

తెలంగాణలో ఒకేరోజు ఇద్దరు మృతి..కొత్త‌గా 41 కేసులు
Follow us

|

Updated on: May 13, 2020 | 11:23 PM

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 41 కేసులు న‌మోదయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ 1367కు చేరుకున్నాయి. బుధవారం కరోనా వల్ల మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఈ మ‌హమ్మారి వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 34కు చేరింది. అయితే, వ్యాధి నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 117 అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 394 యాక్టివ్ కేసులు ఉండ‌గా… మొత్తం ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 939గా ఉంది.

బుధవారం నమోదైన కరోనా వైరస్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 31 కేసులు ఉన్నాయి. మరో 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ‌ హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించింది.