మద్యంతో కరోనా తగ్గుతుందని రూమర్స్.. నాటుసారా తాగి 27 మంది మృతి
చైనాలో ప్రారంభమైన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం 100 దేశాలు కరోనా భారినపడ్డాయి. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంది ఈ వైరస్. దీనిపై రూమర్స్ కూడా ధారాళంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న విభిన్న వార్తలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి అవి ప్రాణాలకు కూడా తీస్తున్నాయి. ఇటలీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నాటుసారా తాగితే కరోనా రాదంటూ కొంతమంది వదంతులు సృష్టించారు. ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో నాటుసారా […]
చైనాలో ప్రారంభమైన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం 100 దేశాలు కరోనా భారినపడ్డాయి. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంది ఈ వైరస్. దీనిపై రూమర్స్ కూడా ధారాళంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న విభిన్న వార్తలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి అవి ప్రాణాలకు కూడా తీస్తున్నాయి. ఇటలీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నాటుసారా తాగితే కరోనా రాదంటూ కొంతమంది వదంతులు సృష్టించారు. ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో నాటుసారా సేవించారు. దాని ప్రభావంతో 27 మంది మరణించారు. మరో 218 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లో కరోనావైరస్ తీవ్రంగా ప్రభలుతోంది. అక్కడ దాదాపు ఏడు వేల మందికి ఈ వైరస్ సోకింది. కోవిడ్ ప్రభావంతో ఈ సోమవారం ఒక్కరోజే అక్కడ 43 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలకు భయం పట్టుకుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా నమ్మి..భిన్న పద్దతులు ఫాలో అవుతున్నారు. అలానే నాటుసారా తాగి ఖుజెస్థాన్ ప్రావిన్సుల్లో 20 మంది, అల్బోర్జ్‌లో 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నాటుసారా సేవించిన కొందరు కంటిచూపు కోల్పోయారు. మరికొందరు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.