ఏపీలో ఘోరం.. 200 కుక్కలకు విషం పెట్టి…
ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టుకుని ఏకంగా వాటికి విషమిచ్చి చంపేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కుక్కలు బెడద నుంచి ఉపశమనం కోసం.. ఏకంగా వాటిని హతమార్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాల రెండు వందల వీధి కుక్కలను […]
ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టుకుని ఏకంగా వాటికి విషమిచ్చి చంపేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కుక్కలు బెడద నుంచి ఉపశమనం కోసం.. ఏకంగా వాటిని హతమార్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాల రెండు వందల వీధి కుక్కలను చంపేశారు. అది కూడా అలా ఇలా కాదు.. ఒకేసారి విష పదార్థాలు ఉపయోగించి మట్టుబెట్టారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న హెల్ప్ ఫర్ యనిమల్ సొసైటీ సభ్యులు.. కంతేరు గ్రామ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పంచాయితీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అమరావతి రాజధాని సమీపంలో వీధికుక్కల బెడద తగ్గించమని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. దాదాపు 50 కుక్కలను హతమార్చారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.