All Arjun: 20 ఏళ్ల కెరీర్.. ఉత్త అల్లు అర్జున్ దగ్గుర్నుంచి.. ఐకాన్ స్టార్ వరకు.. వాటే జర్నీ

అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 ఏళ్లైపోయిందా..? బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్ధాలు పూర్తైపోయాయా..? నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. తాజాగా తన 20 ఏళ్ల జర్నీ గురించి ఎమోషనల్ అయ్యారు బన్నీ. మరి ఈ 20 ఏళ్ల కెరీర్‌లో అల్లు వారసుడు సాధించిన రికార్డ్స్ ఏంటి..? గంగోత్రి టూ పుష్ప వరకు బన్నీ కెరీర్‌లో చోటు చేసుకున్న మార్పులేంటో తెలుసుకుందాం పదండి.

All Arjun: 20 ఏళ్ల కెరీర్.. ఉత్త అల్లు అర్జున్ దగ్గుర్నుంచి.. ఐకాన్ స్టార్ వరకు.. వాటే జర్నీ
Allu Arjun
Follow us

|

Updated on: Mar 30, 2023 | 8:17 PM

అల్లు అర్జున్.. ఈ పేరుకు ఇప్పుడున్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం బన్నీకి అన్నీ విమర్శలే వచ్చాయి. మార్చ్ 28, 2003న గంగోత్రి సినిమాతో పరిచయమైనపుడు.. ఇతను కూడా హీరోనా అన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆర్యతో అన్ని విమర్శలకు సమాధానమిచ్చి.. వారెవ్వా.. ఏమున్నాడు కుర్రాడు అనిపించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ సినిమాతో హ్యాట్రిక్ అందుకుని మార్కెట్ మరింత పెంచుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత హ్యాపీ నిరాశపరిచినా.. దేశముదురుతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రాన్నే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. పరుగుతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన బన్నీ.. వేదంతో డిఫెరెంట్ కథల వైపు అడుగులేసారు. జులాయితో సాలిడ్ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

జులాయి తర్వాత అల్లు అర్జున్ దూకుడు పెంచేసారు. మరీ ముఖ్యంగా రేసుగుర్రం తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డిజే లాంటి వరస విజయాలతో పాటు మార్కెట్ పెంచుకున్నారు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డుల్నే బద్ధలు కొట్టారు. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. దీని తర్వాత పుష్పతో పాన్ ఇండియన్ స్టార్

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయిపోయారు అల్లు అర్జున్. ఈ సినిమాతో హిందీలోనూ సత్తా చూపించారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2తో ఏకంగా 1000 కోట్లపై కన్నేసారీయన. 20 ఏళ్ళ కెరీర్‌లో 6 ఫిల్మ్ ఫేర్స్‌తో పాటు 5 నంది అవార్డులు.. 4 సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు. తనను ఇంత బాగా ఆదరించినందుకు అభిమానులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..