Maha Horror: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కొంతమంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది..

Maha Horror: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు... శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత
Follow us

|

Updated on: Feb 02, 2021 | 6:31 AM

Maha Horror: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కొంతమంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. చిన్నారులకు పోలియో చుక్కల బదులు హ్యాండ్ శానిటైజర్ ను వేశారు.. ఆ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలోని కప్సికోప్రి గ్రామంలో ఆదివారం పోలియో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా భాన్‌బోరా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఐదేళ్లు లోపు వయస్సు ఉన్న 12మంది చిన్నారులకు వ్యాక్సిన్‌కు బదులుగా ఆరోగ్య సిబ్బంది శానిటైజర్‌ చుక్కలు వేశారు. చిన్నారులు అస్వస్థతకు గురవ్వడంతో వారికి వసంతరావు నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు జిల్లా అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ దేవేందర్ సింగ్ బాధిత చిన్నారులను పరామర్శించారు.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఈ ఘటనపై యావత్మాల్‌ జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీకృష్ణ పంచాల్‌ స్పందించారు. ప్రస్తుతం బాధిత చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో పీహెచ్‌సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వాలంటీర్‌ ఉన్నారన్నారని .. వారిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణణ జరుగుతోదంని చెప్పారు శ్రీకృష్ణ.