Kamal Khushlani Mufti: నాడు వ్యాపారం కోసం పది వేల అప్పు.. నేడు భారతదేశంలో కుబేరుల చెంతన స్థానం.. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
ముఫ్తీ వ్యవస్థాపకుడు తన బంధువుల్లో ఒకరి నుంచి రూ.10,000 అప్పుగా తీసుకుని కంపెనీని ప్రారంభించారని తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే ముఫ్తీ వ్యవస్థాపకుడు కమల్ ఖుష్లానీ సాధారణ కుటుంబంలో జన్మించారు. అతని 19 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించాడు. కమల్ ఖుష్లానీ తన కుటుంబానికి సహాయం చేయడానికి ఒక క్యాసెట్ కంపెనీలో పని చేశాడు. అయితే తానూ ఎప్పుడూ ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను సృష్టించాలని కోరుకున్నాడు. చివరకు తన కృషితో పాటు అంకితభావం కారణంగా తన కలను నెరవేర్చుకోగలిగాడు.

ముఫ్తీ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ బ్రాండ్. పురుషుల దుస్తుల మార్కెట్‌లో బ్రాండ్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 500 కోట్లు. అయితే నేడు ఇంత పెద్ద కంపెనీగా అవతరించిన ముఫ్తీ వ్యవస్థాపకుడు తన బంధువుల్లో ఒకరి నుంచి రూ.10,000 అప్పుగా తీసుకుని కంపెనీని ప్రారంభించారని తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే ముఫ్తీ వ్యవస్థాపకుడు కమల్ ఖుష్లానీ సాధారణ కుటుంబంలో జన్మించారు. అతని 19 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించాడు. కమల్ ఖుష్లానీ తన కుటుంబానికి సహాయం చేయడానికి ఒక క్యాసెట్ కంపెనీలో పని చేశాడు. అయితే తానూ ఎప్పుడూ ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను సృష్టించాలని కోరుకున్నాడు. చివరకు తన కృషితో పాటు అంకితభావం కారణంగా తన కలను నెరవేర్చుకోగలిగాడు.
ముఫ్తీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా 379 ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌లు, 89 పెద్ద ఫార్మాట్ స్టోర్‌లు, 1305 మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ముఫ్తీ ఉత్పత్తుల్లోషర్టులు, జీన్స్, ప్యాంటు, టీ-షర్టులు, షార్ట్‌లు, బ్లేజర్లతో పాటు శీతాకాలపు దుస్తులు/ఔటర్‌వేర్‌లతో పాటు పాదరక్షలు కూడా ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 498.18 కోట్లు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.341.17 కోట్లు. 1992లో, కమల్ ఖుష్లానీ పురుషుల షర్ట్స్ కోసం మిస్టర్ అండ్ మిస్టర్ పేరుతో ఒక తయారీ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ పెట్టేందుకు తన అత్త నుంచి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. వర్క్‌షాప్‌లో చొక్కాలు తయారు చేసేవాడు. ఆఫీసు అద్దె కట్టడానికి కమల్ దగ్గర డబ్బు లేకపోవడంతో అతను తన ఇంటిని ఆఫీసుతో పాటు గోదాంగా మార్చుకున్నాడు.
1998లో కమల్ ఖుష్లానీ ముఫ్తీ అనే ఫ్యాషన్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. మొదట్లో కమల్ దగ్గర ఒక బైక్ ఉంది. దాని మీద కిలోల కొద్దీ క్లాత్ లోడ్ చేసి వర్క్ షాప్ కి తీసుకెళ్లేవాడు. బట్టలు తయారు కాగానే వాటిని అదే బైక్‌పై ఎక్కించుకుని విక్రయించేందుకు వెళ్లేవాడు. కమల్ తన బైక్‌పై సూట్‌కేస్‌లో బట్టలు అమ్మేవాడు. 2000 తర్వాత ప్రజలు మఫ్టీ జీన్స్ కొనడం ప్రారంభించినప్పుడు ముఫ్తీ బ్రాండ్ ప్రజాదరణ పొందింది. భారతదేశంలో స్ట్రెచ్‌బుల్ జీన్స్‌ను తయారు చేయడం ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ ముఫ్తీ. ముఫ్తీ ఇప్పుడు ముకేష్ అంబానీకు సంబంధించిన రిలయన్స్ రిటైల్, రతన్ టాటాకు చెందిన వెస్ట్‌సైడ్ వంటి అనేక బ్రాండ్‌లు, వ్యాపార సంస్థలతో పోటీ పడుతున్నారు. ఇది ఇతర వస్తువులతో పాటు బట్టలు, పాదరక్షలను విక్రయించే వ్యాపారంలో కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి