KGF-2 Update: కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి వెళ్లడానికి కౌంట్ డౌన్ మొదలైంది.. యష్ బర్త్‌డే కానుకగా..
KGF Teaser Coming ON: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

KGF Teaser Coming ON: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారాడు. అంతే కాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్.. తెలుగు బడా హీరో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా హీరో యష్ పుట్టిన రోజును పురస్కరించుకొని జనవరి 8న చిత్రయూనిట్ అభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. జనవరి 8, ఉదయం 10.18 నిమిషాలకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. కేజీఎఫ్ సామ్రాజ్య తలుపులు తెరుచుకోవడానికి కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్‌దత్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
The countdown to the opening of the empire door begins now!#KGFChapter2TeaserOnJan8 at 10:18 AM on @hombalefilms@VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84 @Karthik1423 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC pic.twitter.com/nbGU2mrR1M
— Prashanth Neel (@prashanth_neel) January 4, 2021