WITT 2025: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఇక్కడ వీక్షించండి..
భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 వార్షిక కార్యక్రమం “వాట్ ఇండియా థింక్స్ టుడే - గ్లోబల్ సమ్మిట్ 2025” మూడవ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.. దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో మార్చి 28, 29 తేదీలలో ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు పాల్గొననున్నారు.

భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 వార్షిక కార్యక్రమం “వాట్ ఇండియా థింక్స్ టుడే – గ్లోబల్ సమ్మిట్ 2025” మూడవ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.. దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో మార్చి 28, 29 తేదీలలో ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు పాల్గొననున్నారు. టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ వార్షిక కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే కాకుండా వినోదం, వ్యాపారం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.. భారతదేశ సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగనుంది.. మోదీ ప్రభుత్వ నినాదం వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం రోడ్‌మ్యాప్ అనే అంశం గురించి కీలక చర్చ జరగనుంది. వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2025 లో ప్రముఖులు అనేక విషయాలపై సుధీర్ఘ చర్చతోపాటు.. పలు ఆసక్తికర అంశాలను కూడా పంచుకోనున్నారు.
లైవ్‌లో చూడండి..
అయితే.. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే వార్షిక కార్యక్రమం వాట్ ఇండియా థింక్స్ టుడే – గ్లోబల్ సమ్మిట్ 2025 కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం రోడ్‌మ్యాప్ అనే అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. దేశ పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం, ప్రపంచ స్థాయిలో భారతదేశం పాత్ర వంటి అనేక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.
గత సంవత్సరం టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన రెండు ప్రధాన కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే.. టీవీ9 నెట్‌వర్క్ వార్షిక సదస్సు వాట్ ఇండియా థింక్స్ టుడే 2024 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ది అశోక్ హోటల్‌లో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించారు. నవంబర్‌లో జర్మనీలో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌కు కూడా ప్రధానమంత్రి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ ప్రభుత్వం ఒకే విధానంతో ముందుకు సాగుతోందన్నారు. కాగా.. ఈ సారి జరిగే టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..