ఒకే ఒక సూదితో 10 మందికి సోకిన హెచ్ఐవి.. వైద్య ఆరోగ్య శాఖ షాక్!
కేరళలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్ వాడకానికి ఒకే సూదిని ఉపయోగించడం వల్ల 10 మందికి హెచ్ఐవి సోకింది. ఈ సంఘటన మలప్పురం జిల్లాలోని వాలంచెరి మునిసిపాలిటీ ప్రాంతంలో జరిగింది. వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. వారితో పాటు వారి కుటుంబాలు వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో ఉన్నారు.

కేరళలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లాలోని వాలంచెరి మునిసిపాలిటీ ప్రాంతంలో 10 మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యక్తులందరికీ ఒకే సూదితో ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ 10 మందిలో ముగ్గురు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు కాగా, మిగిలిన ఏడుగురు కేరళకు చెందినవారుగా వైద్యారోగ్య శాఖ. దర్యాప్తులో వారందరూ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసేవారని కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. అందరూ ఒకే ఇంజెక్షన్ సిరంజిని ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మలప్పురం జిల్లాలోని వాలంచెరి మునిసిపాలిటీ ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత, హెచ్ఐవి సోకిన వారందరూ మాదకద్రవ్యాల బానిసలని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యక్తులలో ఒకరికి HIV సోకింది. అతను ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజిని మరో తొమ్మిది మంది మాదకద్రవ్యాల దుర్వినియోగానికి ఉపయోగించారు. ఈ సోకిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులు అని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. సోకిన 10 మంది వ్యక్తులను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు.
జనవరి 2025లో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మునిసిపాలిటీ ప్రాంతంలో ఒక హెచ్ఐవి రోగిని నిర్ధారించింది. దీని తరువాత, ఆరోగ్య శాఖ మరింత దర్యాప్తు చేసినప్పుడు, సోకిన వ్యక్తి ఉపయోగించిన సిరంజిని మరో తొమ్మిది మంది కూడా ఉపయోగించారని తేలింది. దర్యాప్తులో భాగంగా వారి మెడికల్ రిపోర్టులు వచ్చినప్పుడు, ఆరోగ్య శాఖ షాక్ అయ్యింది. అందరి వైద్య పరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో మాదకద్రవ్యాల వినియోగదారులలో హెచ్ఐవి సంక్రమణ పెరిగే ప్రమాదం ఉందని జిల్లా వైద్యాధికారి ఆర్. రేణుక హెచ్చరించారు. వాలంచేరిలో హెచ్‌ఐవితో బాధపడుతున్న 10 మంది మాదకద్రవ్యాల బానిసలని, దీనివల్ల వారి కుటుంబాలకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందని ఆర్. రేణుక అన్నారు. ఆరోగ్య శాఖ ఇప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యాధి సోకిన కుటుంబాలను వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..