Oral Health: పడుకునే ముందు పళ్ళు తోమకుంటే ఇంత డేంజరా..? ఈ రిస్క్ తెలిస్తే ఈ రోజే మొదలుపెడతారు
చాలా మంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు చేసే పని పడుకునే ముందు పళ్లు తోముకోవడం. మరికొందరిలో ఈ అలవాటు అసలే ఉండదు. రోజుకు ఒక్కసారి బ్రష్ చేయడమే మహా ఎక్కువని భావిస్తారు. అయితే రాత్రి పూట పళ్లు తోముకోని వారిలో అనర్థాలే ఎక్కువని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. ఇది కావిటీస్ పోగొడుతుందని అంతా భావిస్తారు. అయితే, అలాగే పడుకునే వారిలో ఇది ఆరోగ్యాన్ని మరింత డ్యామేజ్ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు పడుకునే ముందు బ్రష్ చేయడం వల్ల నోటి శుభ్రతను పాటించినవారవుతారు. ఈ అలవాటు మీకు లేకపోతే వెంటనే చేసుకోవాలని చెప్తున్నారు.లేదంటే అంతకు మించిన సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. దీనిపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని దీన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల గుండె జబ్బులు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.
మీరు నిద్రపోయే ముందు పళ్ళు తోముకోకపోతే , మీకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన మూడు విషయాలు ఉన్నాయి…
1. నోటి నుండి వచ్చే బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి, కాలక్రమేణా గుండెను ప్రభావితం చేసే మంటను ప్రేరేపిస్తుంది.
2. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల వచ్చే చిగుళ్ల వ్యాధి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
3. క్రమం తప్పకుండా దంతాలను తోముకోవడంతో పాటు దంతాలను శుభ్రం చేసుకునే వ్యక్తులకు ఆరోగ్యకరమైన హృదయం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, మీ నోటి పరిశుభ్రతను పాటించడం మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సులభమైన మార్గాలలో ఒకటి.
మీ దినచర్యలో ప్రతిరోజూ రాత్రి బ్రష్ చేసుకోవడం ద్వారా, ప్రాణాంతక వ్యాధుల నుండి గుండె వైఫల్యం నుండి కూడా మీ గుండెను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.