చాలా గ్యాప్ తర్వాత గ్రౌండ్‌లోకి ధనాధన్ ధోనీ
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తొలి మ్యాచ్ ఆడనున్నాడు. వరల్డ్ కప్ 2019 సెమీస్‌లో ధోని చివరి సారి మైదానంలో కనిపించారు. అప్పటి నుంచి ధోని అభిమానులు అతడి మెరుపుల కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం...
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తొలి మ్యాచ్ ఆడనున్నాడు. వరల్డ్ కప్ 2019 సెమీస్‌లో ధోని చివరి సారి మైదానంలో కనిపించారు. అప్పటి నుంచి ధోని అభిమానులు అతడి మెరుపుల కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ధోనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. దీంతో ధోని మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ధనా ధన్ షాట్స్ బాధడమే కాదు వ్యూహాలు రచించడంలోనూ ధోనీని మించినవారు లేరనే అంటారు క్రికెట్ పండితులు. భారతీయ క్రికెట్‌లో తానొక సంచలనం. ఓటమి అంచుల వరకూ వెళ్లిన సమయంలో గెలిపించిన నాయకుడు. కెప్టెన్సీకే వన్నె తెచ్చిన ఆటగాడు ఎం.ఎస్.ధోనీ.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చిలో పార్రంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆలస్యంగానైనా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వినోదం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహమ్మారి కారణంగా యూఏఈ (UAE)లో ఈ మెగా టోర్నిని నిర్వహిస్తుండగా..ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరగనున్నాయి. కాగా.. ఈ సారి ఎన్నో నిబంధనల మధ్య ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడనున్నారు. బయో బబుల్ లో జరగనున్న ఈ మెగా టోర్నీని సక్రమంగా సాగాలని ప్రతి క్రీడాభిమాని కోరుకుంటున్నారు.
డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ నువ్వా నేనా అనే రీతిలో తలపడనున్నాయి. అటు రోహిత్, ఇటు ధోని సారథ్యంలో బరిలోకి దిగుతున్న జట్లలలో ఏ జట్టును విజయం వరిస్తుందో తెలియనప్పటికి అభిమానులకు మాత్రం మంచి వినోదం దక్కనుంది.
ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లు తమ ప్లాన్‌ను రెడీ చేసుకున్నాయి. ఈ సారి ఎలాగైనా టైటిట్ గెలవాలని చెన్నై కింగ్స్ బావిస్తుండగా.. తన ఛాంపియన్ హోదాని నిలబెట్టుకోవాలని ముంబై పట్టుదలగా ఉంది. ఈ రోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం.