వెయ్యి సిక్సర్ల వీరుడు క్రిస్‌ గేల్‌!

క్రిస్‌ గేల్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు చెప్పడమంటే చందమామకు వెన్నెల గురించి చెప్పినట్టే అవుతుంది.. గేల్‌ను యూనివర్స్‌ బాస్‌ అని ఎందుకంటారో నిన్న రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను చూసినవాళ్లకు అర్థమవుతుంది.. అదొక్కటే కాదు.. గేల్‌ ఆడిన ఏ మ్యాచ్‌ అయినా అంతే! ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందే! బౌలర్‌ ఎలాంటి బాల్‌ వేసినా గేల్‌ లెక్క చేయడు.. ఆ బంతి బౌండరీ దాటాలన్నదే లక్ష్యంగా పెట్టకుంటాడు.. లేకపోతే టీ-20 ఫార్మట్‌లో వెయ్యి సిక్సర్లు బాదడం ఎవరి వల్లనైనా అవుతుందా? […]

వెయ్యి సిక్సర్ల వీరుడు క్రిస్‌ గేల్‌!
Follow us

|

Updated on: Oct 31, 2020 | 2:43 PM

క్రిస్‌ గేల్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు చెప్పడమంటే చందమామకు వెన్నెల గురించి చెప్పినట్టే అవుతుంది.. గేల్‌ను యూనివర్స్‌ బాస్‌ అని ఎందుకంటారో నిన్న రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను చూసినవాళ్లకు అర్థమవుతుంది.. అదొక్కటే కాదు.. గేల్‌ ఆడిన ఏ మ్యాచ్‌ అయినా అంతే! ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందే! బౌలర్‌ ఎలాంటి బాల్‌ వేసినా గేల్‌ లెక్క చేయడు.. ఆ బంతి బౌండరీ దాటాలన్నదే లక్ష్యంగా పెట్టకుంటాడు.. లేకపోతే టీ-20 ఫార్మట్‌లో వెయ్యి సిక్సర్లు బాదడం ఎవరి వల్లనైనా అవుతుందా? టెస్ట్‌ అయినా వన్డే అయినా టీ-20 అయినా గేల్‌ ఆట తీరు అలాగే ఉంటుంది.. బంతిని కసితీరా కొట్టడమన్నది వెస్టిండీస్‌ జీన్‌లోనే ఉంది కాబోలు.. అందుకే క్రికెట్ ఆడే దేశాలన్నీ గేల్‌కు సలాం కొడతాయి.. బౌలర్లు సాష్టాంగపడతారు.. ప్రపంచ టీ-20 క్రికెట్‌లో ఇప్పుడు గేల్‌ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.. వెయ్యి సిక్సర్లను సాధించిన తొలి ఆటగాడయ్యాడు.. బహుశా ఈ రికార్డు గేల్‌ పేరిట అలాగే నిలిచిపోతుందేమో! ఈ ఫీట్‌ను సాధించడం అందరికీ సాధ్యం కాదు.. ఉన్న కొందరు గేల్‌ను అందుకోలేనంత దూరంలో ఉన్నారు.. ఎందుకంటే రెండోస్థానంలో ఉన్న కీరన్‌ పోలార్డ్‌ 690 సిక్సర్లే సాధించాడు.. ఇతడు కూడా వెస్టిండీస్‌కు చెందిన వాడేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎక్కడ వెయ్యి సిక్సర్లు? ఎక్కడ 690 సిక్సర్లు..? మూడో ప్లేస్‌లో ఉన్న బ్రెండన్‌ మెకల్లమ్‌ అయితే కొట్టినవి 485 సిక్సర్లే..! ఇక మన రోహిత్‌ శర్మ 376 సిక్సర్లు కొట్టాడు.. అంచేత వెయ్యి సిక్సర్లు కొట్టడమంటే మామూలు విషయం కాదు.. ఇక ఐపీఎల్‌లో గేల్‌ ఇప్పటి వరకు 349 సిక్సర్లు కొట్టాడు..