ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌కి అంతా సిద్ధం.. ప్రతి సెంటర్‌లో తొలిరోజు 100 మందికి టీకా.. రేపు ప్రారంభించనున్న ప్రధాని

కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలు ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ డోసులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరవేసింది.

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌కి అంతా సిద్ధం..  ప్రతి సెంటర్‌లో తొలిరోజు 100 మందికి టీకా.. రేపు ప్రారంభించనున్న ప్రధాని
Follow us

|

Updated on: Jan 15, 2021 | 7:29 AM

కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు భారత ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం స్వదేశీయ మందుతో యుద్ధానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలు ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ డోసులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరవేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోది శనివారం ఉదయం గం. 10.30కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,006 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. మొదటి రోజు ప్రతి సెంటర్లోనూ 100 మంది ఎంపికచేసిన లబ్దిదారులకు టీకా మందును అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

తొలివిడతలో కరోనా పోరులో ముందు వరుసలో నిలిచిన ఫ్రంట్ వారియర్స్‌కు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు ఐసీడీఎస్ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు టీకా మందు అందుకోనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూపొందంచిన కో-విన్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రియల్ టైమ్ డాటాతో ప్రతి లబ్దిదారుడి సమాచారాన్ని భద్రపర్చడంతో పాటు టీకా డోసుల లభ్యత, వాటిని భద్రపరిచే ఏర్పాట్లు సహా అన్ని వివరాలను ఈ కో-విన్ అప్లికేషన్లో పొందుపర్చనున్నారు. ఫలితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మేనేజర్లకు ఈ యాప్ ఎంతో సదుపాయంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి అనుమానాల నివృత్తికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కార్యక్రమంపై ఏ రకమైన సందేహాలున్నా తీర్చేందుకు 24గంటల పాటు పనిచేసే విధంగా 1075 నెంబర్ కాల్ సెంటర్ ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఇది కో-విన్ సాఫ్ట్‌వేర్ తో అనుసంధానమై ఉంటుందని వెల్లడించింది. ఇకపోతే, దేశంలో తగినంతగా కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను సిద్ధం చేసినట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యాక్సిన్లను అయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారులు చేరవేశారు. పౌరవిమానయాన శాఖ సహాయంతో అన్ని ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్నా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Read Also… రాజధానిలో కొనసాగుతున్న రైతు సంఘాల ఆందోళన.. ఢిల్లీ గవర్నర్ హౌస్ వద్ద ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..