మనలో చాలా మంది తియ్యటి కొబ్బరిని ఇష్టంగా తింటాం. కాస్తంత కూరల్లో వేస్తే.. వాటి రుచి రెట్టింపవుతుంది. చట్నీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్నీ చేకూర్చే కొబ్బరితో చాలానే పిండివంటలున్నాయి
TV9 Telugu
కొబ్బరి ప్రయోజనాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడతారు లేదంటే చట్నీ చేసుకుని తింటారు
TV9 Telugu
ఇందులో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, రాగి, భాస్వరం, పొటాషియం, ఇనుము, జింక్, అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
కొబ్బరికాయ చిన్న ముక్కలుగా కోసి, నీటిలో నానబెట్టి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరిని ఇలా నానబెట్టి ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట
TV9 Telugu
చట్నీ లేదా ఏదైనా రూపంలో నానబెట్టిన కొబ్బరిని తింటే శరీరానికి ఫైబర్ అధికంగా అందుతుంది. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది
TV9 Telugu
రక్తహీనత, బలహీనత లేదా లోపం వంటి సమస్యలు ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్నవారికి బరువు పెరగడానికి ఇది మంచి బలాన్ని ఇస్తుంది
TV9 Telugu
నానబెట్టిన కొబ్బరిని నల్ల మిరియాలుతో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది. మెదడుకు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
కానీ దీన్ని ఎల్లప్పుడూ పరిమిత మోతాదులోనే తినాలి. రోజుకి ఒకటి లేదా ఒకటిన్నర అంగుళం కొబ్బరి ముక్క తింటే సరిపోతుంది. ఇంత కంటే ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు