మూడు పూటలా అన్నం తింటే ఏమవుతుందో తెల్సా..?

27 April 2025

TV9 Telugu

TV9 Telugu

మన దేశంలోని అనేక ప్రాంతాల్లో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇది రుచిలో తేలికగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది కూడా

TV9 Telugu

బియ్యం అన్నంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, సోడియం, మెగ్నీషియం, ఫోలేట్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి

TV9 Telugu

అయితే చాలా మంది మూడు మూటలా అన్నమే తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? సమస్యలేమైనా వస్తాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది

TV9 Telugu

నిజానికి, వేసవిలో ప్రతిరోజూ బియ్యం తినవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ ఆహారంపై కాస్త నియంత్రణ చూపడం ముఖ్యమట

TV9 Telugu

బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. చురుకైన జీవనశైలిని కలిగి ఉన్న వ్యక్తులకు బియ్యం మంచి ఎంపిక

TV9 Telugu

సాధారణ బియ్యం త్వరగా జీర్ణమై కడుపును చల్లబరుస్తుంది. విరేచనాలు, అజీర్ణం, ఆమ్లత్వం ఉన్న సందర్భంలో సాదా బియ్యం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

బియ్యం సహజంగా గ్లూటెన్ రహిత ధాన్యం. కాబట్టి గ్లూటెన్‌కు అలెర్జీలు లేదా సున్నితత్వం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక

TV9 Telugu

అయితే రక్తంలో చక్కెర అధికంగా ఉండే డయాబెటిస్‌ రోగులు మాత్రం అన్నం అధికంగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలోని కార్బోహైడ్రేట్లు షుగర్‌ స్థాయిలను పెంచేస్తాయ్‌