రాజధానిలో కొనసాగుతున్న రైతు సంఘాల ఆందోళన.. ఢిల్లీ గవర్నర్ హౌస్ వద్ద ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఐక్యతా సందేశాన్ని వినిపించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు.

Rahul Gandhi to farmers protest march : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు తెలపునున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఐక్యతా సందేశాన్ని వినిపించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని గవర్నర్ హౌస్ నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. తమిళనాడు పర్యటన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేరుగా ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో పాల్గొననున్నారు. కాగా, గడచిన డిసెంబరులో రాహుల్ గాంధీ ఇదేవిధమైన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపట్టబోగా, ఢిల్లీ పోలీసులు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
మరోవైపు, కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతుల సంఘాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరోసారి 11వ సారి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 15న కిసాన్ అధికార్ దివస్ నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు పలుకుతూ, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలన్నారు. అన్నదాతలకు అండగా నిలవాలని పిలపునిచ్చారు సోనియా గాంధీ.