Yawning: ఎవరైనా ఇతరులను చూసి ఆవలిస్తున్నారా.. ఇలా జరగడానికి కారణం సైన్స్ ఏమి చెప్పిందంటే

గియాకోమో అతని బృందం కలిసి కోతి మెదడుపై పరిశోధన చేశారు. కోతి మెదడులోని ఈ న్యూరాన్ కార్యకలాపాలను నమోదు చేశారు. ప్రయోగం సమయంలో, ఇతర జంతువుల కార్యాచరణను కూడా కాపీ చేశారు. 

Yawning: ఎవరైనా ఇతరులను చూసి ఆవలిస్తున్నారా.. ఇలా జరగడానికి కారణం సైన్స్ ఏమి చెప్పిందంటే
Yawning
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 11:02 AM

ఎవరైనా తుమ్మితే అది చూసిన ఇతరులకు తుమ్ము రాదు.. అదే ఎవరైనా ఆవలిస్తే.. వెంటనే అది చూసిన వారికీ ఆవలింత వస్తుంది. అవును ఇతరులు ఆవులించడం చూసి మీరు కూడా ఆవులించడం ప్రారంభిస్తారు.. అయితే ఇలా జరగం మీకు ఒక్కరికి మాత్రమే కాదు ప్రపంచంలో చాలా మందికి ఇలాగే జరుగుతుంది. సైన్స్ భాషలో.. ఇలా జరగడాన్ని ఇన్ఫెక్షియస్ ఆవలింత అని పిలుస్తారు. అయితే ఇది ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కాదు కనుక పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా అవలింతకు ని సంబంధం  మెదడుతో ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో సైన్ చెప్పిన రీజన్ ఏమిటో తెలుసుకుందాం..

ఆవలింత కు అవలింతకు ఉన్న లింక్ ఏమిటో తెలుసుకోవడానికి.. శాస్త్రవేత్తలు  చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.   వీరి పరిశోధనలో ఇతరులు ఆవలించడం చూసిన తర్వాత.. అవతలి వ్యక్తి ఎందుకు అలా చేయడం ప్రారంభిస్తాడనే విషయం వెల్లడైంది.

కారణాన్ని వివరించిన ఇటలీ శాస్త్రవేత్త  ఒక వ్యక్తి ఆవులించడం చూసిన తర్వాత అవతలి వారికీ కూడా ఎందుకు అవలించాలనిపిస్తుంది?  దీనికి కారణం చెప్పాడు ఇటలీ శాస్త్రవేత్త. ఇలా అసంకల్పిత ప్రతీకార చర్యగా అవలించడానికి కారణం మిర్రర్ న్యూరాన్ అని అంటున్నారు. ఈ న్యూరాన్  కనెక్షన్ కొత్తది నేర్చుకోవడం.. తాదాత్మ్యం .. కాపీ చేయడం వంటి వాటికి సంబంధించినది.

ఇవి కూడా చదవండి

మిర్రర్ న్యూరాన్‌ను 1996లో ఇటాలియన్ న్యూరోబయాలజిస్ట్ గియాకోమో రిజోలాటి కనుగొన్నారు. గియాకోమో అతని బృందం కలిసి కోతి మెదడుపై పరిశోధన చేశారు. కోతి మెదడులోని ఈ న్యూరాన్ కార్యకలాపాలను నమోదు చేశారు. ప్రయోగం సమయంలో, ఇతర జంతువుల కార్యాచరణను కూడా కాపీ చేశారు.

మిర్రర్ న్యూరాన్లు మానవులలో పనితీరు  కోతుల తర్వాత.. ఈ మిర్రర్ హార్మోన్లు మానవులలో అదే విధంగా పనిచేస్తాయని మానవులపై చేసిన ప్రయోగంలో నిరూపించబడింది.  అంటే.. ఎవరైనా నిచ్చెన ఎక్కినట్లు మనం చూస్తే.. దానితో సంబంధం ఉన్న న్యూరాన్లు చురుకుగా మారతాయి.  అప్పుడు చూస్తున్న వారికీ అదే విధంగా స్పందిచమని ఈ హార్మోన్లు చెబుతాయి.

అదేవిధంగా… ఎవరైనా ఆవలించడం చూసినప్పుడు, అతని మెదడులోని మిర్రర్ న్యూరాన్లు చురుకుగా పనిచేస్తాయి. అవి అతనిని అలాగే చేయమని చెబుతాయి. అందుకనే అవతలి వ్యక్తి కూడా అదే పని చేయడం ప్రారంభిస్తాడు.

మిర్రర్ న్యూరాన్లు మెదడులోని వేరియబుల్ భాగాలలో కనిపిస్తాయి-ప్రీమోటర్, ఇన్ఫీరియర్ ఫ్రంటల్ గైరస్, ప్యారిటల్ లోబ్..  సుపీరియర్ టెంపోరల్ సల్కస్. ఇందులోని ప్రతి భాగం వివిధ రకాల పనులకు ప్రసిద్ధి చెందింది. మిర్రర్ న్యూరాన్ మెదడులోని వేరియబుల్ భాగాల సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

ఈ మిర్రర్ న్యూరాన్లు ప్రభావితమైనప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయని ..  అవి పనిచేయాల్సిన విధంగా పనిచేయవని పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఆటిజం, స్కిజోఫ్రెనియా, మెదడు సంబంధిత వ్యాధులున్నవారు ప్రభావితమవుతారు. ఉదాహరణకు, ఆటిజం ఉన్న రోగుల విషయంలో.. ఆవలింత ప్రభావం ఇతర వ్యక్తులలో ఉన్నంతగా ఉండదు. కనుక ఇతరులు చూస్తున్నప్పుడు ఎవరైనా ఆవలిస్తే.. వారిపై మిర్రర్ న్యూరాన్‌ల ప్రభావం ఉందని గుర్తించుకోండి. ఈ న్యూరాన్స్ మానవ మెదడును కాపీ చేయమని చెబుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..