Dream: కలలో పాము కోరలు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
మనుషులకు కలలు రావడం కామన్. కానీ కలలో కొందిరికి అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి. అయితే పాములు ప్రత్యేకంగా కలలో కనిపిస్తే రాజయోగం పడుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. ఎప్పుడైనా కలలో తెల్ల పాము కనిపిస్తే చాలా మంచిది. శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి తొందరగా బయటపడతారు. జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే...

కలలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది. త్రాచుపాము కలో కనిపించిన వాళ్లకి తొందరలోనే విశేషమైనటువంటి ధనము సంపదా కలుగుతాయి. విపరీతమైన రాజయోగం పడుతుంది. అలాగే సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా కలలో పాము కనిపించినప్పుడు పాము తల తోక మొత్తం కనిపించినా కూడా అదృష్టమే. సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కలలో కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కలలో మీకు పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే ధనయోగం కలుగుతుంది. అలా కాకుండా పాము పుట్ట లోపల నుంచి బయటికి వస్తున్నట్టు కనిపిస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు.
అలాగే ఎప్పుడైనా కలలో పాము చెట్టు ఎక్కినట్టు మీకు కనిపించింది అనుకోండి తొందరలోనే జీవితంలో డెవలప్ అయ్యే విశేషమైనటువంటి యోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా చెట్టు నుంచి కిందకు దిగుతుందనుకోండి. ఉన్న పొజిషన్ మొత్తం డౌన్ అయిపోయి చాలా వరకు ధన నష్టం కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా కలలో మీకు ఒక దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే మాత్రం చాలా అద్భుతమైన రాజయోగం పడుతుంది. మీ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీరుతూ ఉంటాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. అలాగే ఇంట్లో పాము ఉన్నట్టు కలలో కనిపించినా కూడా చాలా మంచిది. అది చాలా మహిమాన్వితమైనటువంటి కల. ఇంట్లో పాము ఉన్నట్టు కలలో కనిపిస్తే తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు కలలో పాములు కొట్టుకుంటున్నట్టు కనిపించాయి అనుకోండి. భవిష్యత్తులో మీరు సామాజిక సమస్యల కోసం పోరాడతారు. ఒక సమస్య మీద భవిష్యత్తులో సమాజం కోసం ఖచ్చితంగా పోరాడటానికి ఈ కలను మనం ఉదాహరణగా తీసుకోవాలి.
అలాగే ఎప్పుడైనా కలలో చనిపోయిన పాము కనిపిస్తే మాత్రం అది దోషం. మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అప్పుడు ఆ కల వల్ల వచ్చిన చెడు ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ఎప్పుడైనా పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడ్డట్టుగా కలలో కనిపించింది అనుకోండి. ఇంట్లో వాళ్ళకి ఒక అనారోగ్యం రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఈ నెగెటివ్ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా పాము అగ్నిలో పడినట్టుగా కలలో కనిపిస్తే ఇంట్లో.. ధనం మొత్తం హారతి కర్పూరాలా కరిగిపోతుందని ఈ కలకు అర్థం మనకు స్వప్న సిద్ధాంతంలో చెప్పారు.
అలాగే ఒక్కొక్కసారి పాము కోరలు మనకు కలలో కనిపిస్తూ ఉంటాయి. పాము కోరలు కలలో కనిపిస్తే మాత్రం స్నేహితుల వల్ల గాని బంధువుల వల్లగాని ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని అర్థం చేసుకోవాలి. అసలు మనం పాముని కలలో చూడగానే మనకు బాగా భయం వేసింది అనుకోండి. అలాంటి కలకు సంకేతం ఏంటంటే మీ స్నేహితులు గాని బంధువులు గాని మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారు అని అర్థం. అందుకే మీరు ఎప్పుడైనా కలలో పామును చూసి భయపడ్డారు అనుకోండి… వెంటనే తొందరలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ఒకసారి అభిషేకం చేయించుకోవాలి.
ఇలా పాములు కలలో కనిపిస్తే ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు పడతాయి. ఆ కలల వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అశుభమైనటువంటి సర్పం కలలో వచ్చినప్పుడు మాత్రం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా వచ్చినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..