AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. జాగ్రత్త పడలేదో..

ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచడం ఆనందకరమైన అనుభవం. అవి మనకు మానసిక ఉపశమనం ఇవ్వడమే కాదు.. కుటుంబంలో ఆనందాన్ని పంచుతాయి. అయితే ఈ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడంలో ముఖ్యమైన అంశం.. టీకాలు వేయించడం. సమయానికి టీకాలు వేయకపోతే పిల్లులకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

మీ ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. జాగ్రత్త పడలేదో..
Vaccination For Cats
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 9:22 PM

Share

పిల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలంటే.. అవి వ్యాధులకు గురికాకుండా చూసుకోవాలి. దీనికి తగిన సమయంలో అవసరమైన టీకాలు వేయించడం చాలా అవసరం. ముఖ్యంగా వైరస్ వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ టీకాలు బాగా పనిచేస్తాయి. పిల్లులకు తప్పనిసరిగా వేయవలసిన టీకాలలో FVRCP టీకా ముఖ్యమైనది. ఇది ఫెలైన్ వైరల్ రైనోట్రాకైటిస్, కాలిసివైరస్, పాన్‌ ల్యూకోపీనియా వంటి ప్రమాదకర వైరస్‌ ల నుంచి పిల్లిని రక్షిస్తుంది. అలాగే మనుషులకూ ప్రాణాపాయం కలిగించే రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా కూడా టీకా వేయాలి.

బయట ఎక్కువసేపు గడిపే పిల్లులు లేదా ఇతర పిల్లులతో తిరిగే పిల్లులకు ఫెలైన్ ల్యూకీమియా వైరస్ (FeLV) టీకా అవసరం. అలాగే ఇంట్లో ఎక్కువ పిల్లులు ఉన్నా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు. కాబట్టి అదనపు టీకాలు వేయించాలి. టీకాలు ఒక్కసారి వేయడమే కాదు.. వాటికి సమయానికి బూస్టర్ డోసులు ఇవ్వడం కూడా చాలా అవసరం. ఇవి పిల్లిలో రోగనిరోధక శక్తిని స్థిరంగా ఉంచుతాయి.

కొంతమంది పిల్లులకు అలెర్జీ లేదా తక్కువ రోగనిరోధక శక్తి ఉండొచ్చు. అలాంటివి టీకాకు వ్యతిరేకంగా స్పందించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో యాంటీబాడీ టైటర్ టెస్ట్ ద్వారా పిల్లిలోని రోగనిరోధక స్థాయిని అంచనా వేసి అవసరం లేని టీకాలను తప్పించవచ్చు.

టీకా వేసిన తర్వాత కొంతమంది పిల్లుల్లో తాత్కాలికంగా వాపు, అలసట, అసౌకర్యం వంటి చిన్న లక్షణాలు కనిపించొచ్చు. ఇవి సాధారణమే అయినా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి. పిల్లులకు క్రమంగా టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా.. ఇతరులకు వ్యాధులు వ్యాపించకుండా ఉండేలా చూడొచ్చు.

(Note: మీ పెంపుడు జంతువుల ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వెటర్నరీ డాక్టర్‌ ను సంప్రదించాలి)