Western Toilet: టాయిలెట్ ఫ్లెష్‌పై రెండు బటన్స్ ఎందుకు.. తెలుసుకోకుంటే మీకే నష్టం..
రోజూ చేసే పనులే కానీ, ఏ రోజూ వాటి గురించి అంతగా పట్టించుకోము. నిజానికి మన చుట్టూ ప్రతి రోజూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కనపడుతుంటాయి. అలాంటి విషయమే ఇది కూడా. రోజూ వాడే టాయిలెట్ ఫ్లెష్ మీద రెండు బటన్స్ ఎందుకుంటాయో ఎప్పుడైనా గమనించారా?..

ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే కనిపించే వెస్ట్రన్ టాయలెట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. హోటల్స్ నుంచి కొత్తగా కట్టుకునే ఇళ్ల వరకూ ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్ల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లో మాత్రమే అనుకుంటే పల్లెటూళ్లలోనూ ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. అంతలా ఇవి మన జీవితంలో అలవాటుగా మారిపోయాయి. ఇండియన్ టాయిలెట్స్ వాడకంతోనే ఆనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలిసినప్పటికీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు వెస్ట్రన్ వైపే మొగ్గుచూపుతున్నారు. మోకాళ్లు, నడుము నొప్పులు ఉన్నవారు, పెద్దవారు ఇలా ఇండియన్ టాయిలెట్స్ అందరూ వాడలేకపోవడం వల్లే వీటికి భారత్ లోనూ డిమాండ్ పెరిగింది.
రెండు బటన్స్‌ను ప్రెస్ చేస్తున్నారా..
ఈ టాయిలెట్స్ గురించి ఓ విషయం తెలియకుండానే వినియోగించేస్తుంటారు చాలామంది. వీటిలో ఉండే ఫ్లెష్‌ట్యాంక్ ను మీరెప్పుడైనా గమనించారా.. అందులో ఫ్లెష్ చేసేందుకు ఒకటి కాదు రెండు బటన్స్ కనపడుతుంటాయి. వాటిని నొక్కేటప్పుడు అందరికీ ఓ సందేహం కలుగుతుంది. చాలా మంది ఏదో ఒకటి కాకుండా రెండూ నొక్కేసి బయటకు వచ్చేస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ వాష్ రూంకు వెళ్లినప్పుడే ఆ రెండు బటన్లు ఎందుకా అనే సందేహం కలుగుతుంది. నిజానికి ఇలా రెండు బటన్స్ ను ప్రెస్ చేయడం సరైందికాదు. ఎందుకో తెలియాలంటే ముందు ఇలా ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలి.
అసలు కారణం ఇదే..
టాయిలెట్స్ ను యూరినేషన్ కోసం, మలవిసర్జన కోసం ఇలా రెండు రకాల పనుల కోసం వినియోగిస్తుంటారని తెలిసిందే. అందుకోసమే ఈ స్పెషల్ బటన్. ఇందులో రెండు ట్యాంకుల ఫెసిలిటీ ఉంటుంది. ఒక దాంట్లో రెండు నుంచి మూడు లీటర్ల నీటిని స్టోర్ చేస్తే.. మరొక దాంట్లో 3 నుంచి నాలుగున్నర నీటిని స్టోర్ చేస్తుంది. ద్రవ వ్యర్థాల వంటి వాటికి తక్కువ నీటిని ఫ్లష్ చేస్తే సరిపోతుంది. అదే ఘన వ్యర్థాలకు మాత్రం పెద్ద ట్యాంకు వాటర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఏది దేనికోసం అనే విషయం స్పష్టంగా తెలియకపోవడం వల్ల కొందరు ఏదో ఒకటి నొక్కేసి బయటకు వచ్చేస్తుంటారు. రౌండ్ గా కనిపించే బటన్ ఏరియాలో పెద్ద ట్యాంకు బటన్ కు ఎక్కువ ప్లేస్.. చిన్న ట్యాంకు బటన్ కు తక్కువ ప్లేస్ కేటాయించి ఉంటాయి. ఇలా దేనికి కేటాయించిన దాన్ని దాని కోసం వాడటం వల్ల నీటిని వేస్టేజ్ కాకుండా కాపాడగలిగినవారమవుతాం. ఈ ఫ్లష్ ను నొక్కిన తర్వాత చేతులను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఇక్కడి నుంచి వచ్చే బ్యాక్టీరియా ఎన్నో రోగాలకు కారణమవుతుంది.




