Kuja Vakri: కుజుడి వక్ర త్యాగం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Mars Retrograde 2025: ప్రస్తుతం మిథున రాశిలో వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఈ నెల 25న వక్ర త్యాగం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో కుజుడు ఎటువంటి దోషమూ లేకుండా ఏప్రిల్ 2వ తేదీ వరకు సంచారం చేయడం జరుగుతుంది. మిథున రాశి కుజుడి వల్ల కొన్ని రంగాలకు చెందిన వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు కూడా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. నలభై రోజుల పాటు కొన్ని రాశులవారికి కుజుడు అనుకూలంగా ఉండబోతున్నాడు.

Kuja Vakri 2025
Kuja Vakri 2025: ప్రస్తుతం మిథున రాశిలో వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఈ నెల 25న వక్ర త్యాగం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో కుజుడు ఎటువంటి దోషమూ లేకుండా ఏప్రిల్ 2వ తేదీ వరకు సంచారం చేయడం జరుగుతుంది. మిథున రాశి కుజుడి వల్ల టెక్నికల్, టెక్నలాజికల్, స్పోర్ట్స్, ట్రావెల్స్, టూరిజం వంటి రంగాలకు చెందినవారికి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతుంది. ఈ రంగాల ద్వారా ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఇతర రంగాలకు చెందిన వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు కూడా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నలభై రోజుల పాటు మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశులవారికి మిథున కుజుడు అనుకూలంగా ఉండబోతున్నాడు.
- మేషం: రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారికైనా పురోగతి ఉంటుంది. అనేక అవకాశాలు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూ లాభాలు కూడా కలుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
- మిథునం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఈ రాశికి చెందిన ఐ.టి నిపుణులు బాగా రాణించే అవకాశం ఉంది. విదేశాల్లో వీరికి స్థిరత్వం, ఆదరాభిమానాలు లభిస్తాయి. అనేక విధాలైన పురోగతి ఉంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కొన్ని ప్రధానమైన ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి పోటీనైనా ఎదుర్కోగల నైపుణ్యాలను సంపాదించు కుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఏ రంగంలో ఉన్న ఊహించని పదోన్నతులు లభి స్తాయి. అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి భూ లాభం కలిగే అవకాశం కూడా ఉంది. సొంత ఇంటి కల నెరవేరు తుంది. సోదరులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి దశ తిరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయ లాభాలు, ఆస్తి లాభాలు కలుగుతాయి.
- తుల: ఈ రాశికి కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక విధాలైన ధన యోగాలు కలుగు తాయి. విదేశీ సంపాదనను గడించే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి భూలాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరు గుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజ సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. వీటివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం లాభం కలుగుతుంది. స్థిరాస్తుల క్రయ విక్రయాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్ట నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి.



