AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఆర్థికంగా ఇబ్బందులా.? ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా చూసుకోండి..

ఆర్థిక పరిస్థితులకు, వాస్తుకు మధ్య సంబంధం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అంటారు. ముఖ్యంగా మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు మిస్టేక్స్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Vastu Tips: ఆర్థికంగా ఇబ్బందులా.? ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా చూసుకోండి..
Vastu Mistakes
Narender Vaitla
|

Updated on: Oct 03, 2024 | 7:16 PM

Share

ఆర్థిక పరిస్థితులకు, వాస్తుకు మధ్య సంబంధం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అంటారు. ముఖ్యంగా మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు మిస్టేక్స్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే ఆ వాస్తు తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మంది కొత్త చెప్పులు కొనుగోలు చేసినా పాత చెప్పులను అలాగే ఉంచుతుంటారు. పాడైపోయి, చిరిగిపోయిన చెప్పులను అలాగే ఉంచుతారు. అయితే ఇలా పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే ఉపయోగం లేని చెప్పులను బయటపడేయడమే బెటర్‌ అని అంటున్నారు.

* పాడై పోయిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నిల్వ ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. ఇది ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అప్పులు పెరగడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

* మనలో చాలా మంది పాత న్యూస్‌ పేపర్లను ఇంట్లో అలాగే పెడుతుంటాం. అయితే ఇది కూడా మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పాత న్యూస్‌ పేపర్లను కుప్పగా మార్చడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు పేపర్లను బయటపడేయడం లేదా అమ్మేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

* పనికి రాని చీపుర్లను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీటివల్ల కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. చీపురును లక్ష్మీ దేవికి సూచికగా భావిస్తుంటారు. అందుకే చిపురు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటిని ఊడ్చిన తర్వాత చిపురు అందరికీ కనిపించేలా పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తారు.

* ఇంట్లో పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడు బయట పడేస్తుండాలి. ముఖ్యంగా పనికిరాని ఇనుప సామానును ఇంట్లో పేరుకుపోకుండా చూసుకోవాలి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది. అదే విధంగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..