AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ పిల్లలను ఇలా పెంచితే ఉన్నత శిఖరాలకు చేరుతారు.. చాణక్యుడు చెప్పిన రహస్యలు తెలుసా..

ఆచార్యుడు పిల్లల మొదటి విద్యాభ్యాసం వారి ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తల్లిదండ్రుల కర్తవ్యం..

Chanakya Niti: మీ పిల్లలను ఇలా పెంచితే ఉన్నత శిఖరాలకు చేరుతారు.. చాణక్యుడు చెప్పిన రహస్యలు తెలుసా..
Chanakya Niti
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2021 | 8:27 AM

Share

Chanakya Niti: కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని పిలువబడే ఆచార్య చాణక్యుడు ఒక మేధావి. అంతే కాదు.. ఆచార్య చాణక్యుడు అసామాన్యుడు, మేధస్సులో మాస్టర్. ఆచార్య చాణక్యుడు తన తెలివితేటల ఆధారంగా మొత్తం నంద వంశాన్ని నాశనం చేసి చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశాడు. మౌర్య సామ్రాజ్య స్థాపనకు ఆచార్యుడు చేసిన కృషి అంతిమంగా పరిగణించబడుతుంది. కొన్నాళ్ల క్రితం ఆయన తన పాలసీల్లో (చాణక్య నీత) చెప్పిన మాటలు నేటి తరంవారికి కూడా ఉపయోగంగా.. అనసరనీయంగా ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, డబ్బు ఇలా ప్రతి విషయంపైనా ఆచార్యుడు లోతుగా తన చాణక్య నీతి గ్రంధంలో ప్రస్తావించారు. పిల్లల విలువలలో తల్లిదండ్రుల ముఖ్యమైన సహకారాన్ని చాణక్యుడు గుర్తుచేశారు. చాణక్యుడు చెప్పినట్లుగా ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డను సమర్ధవంతంగా తీర్చి దిద్దాలని కోరుకుంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా కష్టపడతారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును తల్లిదండ్రులు ప్రతి ఆనందాన్ని నవ్వుతూ త్యాగం చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతి కోరికను నెరవేర్చడానికి లెక్కలేనన్ని కష్టాలను అనుభవిస్తారు.

అయితే.. ఆచార్యుడు పిల్లల మొదటి విద్యాభ్యాసం వారి ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తల్లిదండ్రుల కర్తవ్యం. పిల్లలు అమాయకంగా ఉంటారు. వారు మొదట వారి తల్లిదండ్రులు వారికి అందించే వాటిని అనుసరిస్తారు.

కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు.. తల్లిదండ్రుల మాట వినరు.. అలాంటి పిల్లలు ఏకపక్షంగా అలవాటు పడతారు. వారు తప్పు.. తప్పు మధ్య తేడాను అర్థం చేసుకోలేరు. కాబట్టి పిల్లలకు ఈ అలవాటును బాల్యంలోనే మెరుగుపరచాలి. అందుకోసం పిల్లలకు ప్రేమతో తప్పు..  తప్పుకు మధ్య అనే తేడాను వివరించాలని చాణక్యుడు తల్లిదండ్రులకు సూచిస్తారు.

ఆచార్య చాణక్యుడు పిల్లలను ఎప్పుడూ ప్రేమతో బోధించాలని అంటారు. ఎందుకంటే పిల్లలను కొట్టడం వల్ల మొండిగా మారుతారని అంటారు. అయితే, ఐదేళ్ల తర్వాత పిల్లలతో కొంచెం కఠినంగా వ్యవహరించాలని సూచిస్తారు. కానీ పిల్లలపై చేతులు ఎత్తడం మానుకోవాలని హెచ్చరిస్తారు.

చాణక్య నీతి ప్రకారం.. కొందరు పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తారని.. అలాంటి పిల్లల పట్ల ప్రేమతో వివరించాలని అంటారు. అబద్ధం చెప్పడం మాన్పించాలి.. ఈ అలవాటును సకాలంలో నివారించకపోతే ఆ తరువాత అది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుందని హెచ్చరిస్తారు చాణక్యుడు.

అంతేకాదు పిల్లలకు చిన్ననాటి నుండి గొప్ప వ్యక్తుల కథలను చెప్పాలని.. ఇవి పిల్లలకు స్ఫూర్తిని ఇస్తాయని చాణక్యుడు అంటారు. మంచి ఆలోచనలు గొప్ప వ్యక్తుల కథల నుంచి వృద్ధి చెందుతాయంటారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల మనసులో తమలాగే ఉండాలనే తపన పెరుగుతుందంటారు. మహానుభావులు పిల్లలకు ఆదర్శంగా మారితే వారి భవిష్యత్తు కూడా బాగుంటుందని చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంధంలో వివరించారు.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..