No Tree in Country: దేశమంతా వెతికినా ఒక్క మొక్క కూడా ఉండదు.. విచిత్రమైన దేశాలివి..!

చెట్లు లేని దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? అంటి చాలా మంది సెకను కూడా ఆలోచించకుండా లేదని సమాధానం చెబుతారు. కానీ, దేశమంతా వెతికినా ఒక్క మొక్క కూడా కనిపించని దేశాలున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే! అవును, ఈ రెండు దేశాల్లో మొక్కలు లేవు. మరి ఆ రెండు దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

No Tree in Country: దేశమంతా వెతికినా ఒక్క మొక్క కూడా ఉండదు.. విచిత్రమైన దేశాలివి..!
No Tree
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2023 | 3:37 PM

చెట్లు లేని దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? అంటి చాలా మంది సెకను కూడా ఆలోచించకుండా లేదని సమాధానం చెబుతారు. కానీ, దేశమంతా వెతికినా ఒక్క మొక్క కూడా కనిపించని దేశాలున్నాయంటే నమ్ముతారా? నమ్మాల్సిందే! అవును, ఈ రెండు దేశాల్లో మొక్కలు లేవు. మరి ఆ రెండు దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్‌లాండ్..

పేరులో చూస్తే ‘గ్రీన్’ ఉంది గానీ.. వాస్తవాంగా మాత్రం అక్కడ ఒక్క మొక్క కూడా ఉండదు. అవును, గ్రీన్‌లాండ్ మొత్తంగా చూసినా చెట్లు, మొక్కలు కనిపించవు. కారణం.. అది మంచుతో కప్పబడి ఉన్న దేశం. అందుకే అక్కడ మొక్కలు, చెట్లు ఉండవు. అయితే, గ్రీన్‌లాండ్ అని పేరు రావడానికి కారణం.. ఈ దేశంలో ఎక్కువ మంది అక్కడి వాతావరణానికి ఆకర్షితులవుతారు. ఆ కారణంగానే దానిని గ్రీన్‌లాండ్ అని పేరు పెట్టారని నివేదికలు చెబుతున్నారు.

ఇక మొక్కలు లేని రెండో దేశం ఏంటో కూడా తెలుసుకుందాం. ఖతార్.. ఇది ప్రపంచంలో సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. సురక్షితమై దేశంగా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలను కలిగి ఉంది. ఈ దేశంలో ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇంత విషాలమైన, ధనిక దేశమైన ఖతార్ ఖాళీ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించదు. అందుకే అక్కడ వర్షపాతం కూడా అత్యంత తక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి మారుతోంది. ప్రజలు సొంతంగా చెట్లు నాటే ప్రయత్నం చేస్తున్నారు. మానవ నిర్మిత అడవిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 40,000 చెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవిని సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..