T Shirt: టీ షర్టులో T అంటే ఏంటో తెలుసా..? చరిత్ర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇక ధర విషయంలోనూ టీ షర్ట్స్ తక్కువగా ఉండడం వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తేలికగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల అందరూ దీనిని ఇష్టంగా ధరిస్తారు. అసలు టీ షర్ట్‌లో టీ అంటే అర్థం ఏంటో తెలుసా..? ఇప్పుడు తెకలుసుకుందాం..

ప్రస్తుతం టీ-షర్ట్ వేసుకోనివారు చాలా అరుదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పురుషుల నుంచి మహిళల వరకు అందరి వార్డ్‌రోబ్‌లో టీ-షర్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తేలికగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల ఎనిమిది నుంచి ఎనభై ఏళ్లవారు కూడా దీనిని ఇష్టంగా ధరిస్తారు. అయితే మనం ప్రతిరోజూ వేసుకునే ఈ టీ-షర్ట్ పేరులో ఉన్న ‘T’ అక్షరం అర్థం ఏమిటో చాలామందికి తెలియదు.
ఆ పేరు వెనుక రెండు కథలు
ఆకారం వల్ల వచ్చిన పేరు
ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ-షర్ట్ నిర్మాణం చాలా సులభంగా ఉంటుంది. దీనికి కాలర్ ఉండదు. దీనికి నిటారుగా ఉండే చేతులు, నేరుగా కిందికి వచ్చే శరీరం ఉంటాయి. ముందు నుంచి లేదా వెనుక నుంచి చూస్తే ఇది అక్షరాలా ‘T’ అక్షరంలా కనిపిస్తుంది. అందుకే దీనికి ‘T-Shirt‘ అనే పేరు వచ్చిందని చెబుతారు.
శిక్షణ చొక్కా నుండి వచ్చిన పేరు
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైనికులు శిక్షణ పొందేటప్పుడు తేలికైన, సౌకర్యవంతమైన చొక్కాలు వేసుకునేవారు. వీటిని ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారు. కాలక్రమేణా ‘ట్రైనింగ్ షర్ట్’ అనే పేరు క్రమంగా చిన్నదై T-Shirt గా మారింది. అంటే దీని వెనుక సైనిక చరిత్ర కూడా ఉందని చెప్పాలి.
టీ-షర్ట్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు
టీ-షర్ట్ మొదట్లో లోదుస్తులలా వాడబడేది. 20వ శతాబ్దం మధ్య కాలంలోనే ఇది ఫ్యాషన్‌లో ఒక భాగమైంది. సినిమాల్లో హీరోలు టీ-షర్టులు వేసుకోవడం ప్రారంభించడంతో ఇది సాధారణ ప్రజలలో కూడా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇది మనం రోజూ వేసుకునే దుస్తులలో ఒకటిగా మారింది.
మనం ధరించే ప్రతి వస్త్రానికి ఒక చరిత్ర, ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘టీ-షర్ట్’ అనే పదం మనకు సాధారణంగా అనిపించినా, దాని వెనుక ఫ్యాషన్ లేదా యుద్ధ చరిత్రలోని ఒక చిన్న మలుపు ఉందని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
