Global Water Crisis: నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!

భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..! అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. అపారమైన సౌరశక్తి, పవన విద్యుత్తు, అణు ఇంధనం రూపంలో చమురుకు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. కానీ నీటికి ప్రత్యామ్నాయం ఏముంది?

Global Water Crisis: నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!
Global Water Crisis
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 26, 2024 | 8:34 AM

భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..! అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. అపారమైన సౌరశక్తి, పవన విద్యుత్తు, అణు ఇంధనం రూపంలో చమురుకు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. కానీ నీటికి ప్రత్యామ్నాయం ఏముంది? యావత్ ప్రాణికోటికి నీరు ప్రాణాధారం. మానవ నాగరికతలు సైతం నిరంతరం నీటిని అందించిన నదీతీరాల వెంటనే విలసిల్లాయి. కానీ ఆ నీరే ఇప్పుడు చమురు కంటే విలువైనదిగా మారిపోయింది.

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ నలుదిశలా విస్తరిస్తున్న టెక్నాలజీ నగరం బెంగళూరు ఇప్పుడు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చివరకు రేషన్ మాదిరిగా నీటిని కొలతలు కొలిచి పంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బెంగళూరులో ఎదురైన పరిస్థితి భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్ ప్రపంచమే నీటి ఎద్దడిని ఎదుర్కోనే కాలం ఎంతో దూరంలో లేదు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో చాలా భాగం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. ప్రపంచంలోని 164 దేశాల్లో చేసిన అధ్యయనంలో 51 దేశాలు, ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని తేలింది.

ప్రపంచ జనాభాలో 31 శాతం నీటి కొరత ప్రభావానికి గురికానుంది. యురోపియన్ భూభాగంలో పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ వంటి దక్షిణ దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోనున్నాయి. ఫ్రాన్స్, పోలాంటి వంటి దేశాల్లో మధ్యస్తంగా కొరత ఏర్పడుతుందని WRI నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దేశాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల నిల్వల్లో 20 నుంచి 40 శాతం మేర వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అదే అరేబియా ద్వీపకల్పంతో పాటు ఇరాన్, ఇండియా, అల్జీరియా, ఈజిప్ట్, లిబియా వంటి దేశాల్లో 2050 నాటికి అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో ఏకంగా 80 శాతం వరకు వినియోగించుకోవాల్సిన స్థితి ఏర్పడనుంది.

ప్రపంచానికే సవాల్!

వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) అధ్యయనాల్లో బయటపడ్డ అంశాలు ప్రపంచంలో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సమస్య కాదు. ఇది యావత్ ప్రపంచానికే ఆందోళన కల్గించే అంశంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు నీటి కొరత క్రమేణా పెరుగుతూ ప్రపంచ సమస్యగా మారుతోందని చెబుతున్నాయి. భారత్‌ విషయంలోనూ ప్రతికూల అంచనాలే కనిపిస్తున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) గణాంకాల ప్రకారం దేశంలోని సగానికి పైగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వాటి సామర్థ్యం కంటే 40 శాతం దిగువకు పడిపోయాయి. రెండింట మూడొంతుల రిజర్వాయర్లలో వాటి సామర్థ్యం కంటే 50 శాతం దిగువకు చేరడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారతాయని అర్థమవుతోంది.

భూగోళం మొత్తం నీటితోనే ఆక్రమించుకున్నప్పటికీ మానవాళి అవసరాలకు వినియోగించుకునే మంచినీరు మాత్రం చాలా తక్కువ పరిమాణంలోనే ఉందన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన దేశంగా మారిన భారత్‍‌ ప్రపంచ జనాభాలో 16 శాతం వాటా కలిగి ఉంది. కానీ ప్రపంచంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో కేవలం 4 శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. నేడు బెంగళూరు నగరం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులను భవిష్యత్తులో దేశంలోని అనేక ఇతర నగరాలు సైతం ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలోని 16.3 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగు నీటిని అందుకోలేకపోతున్నారు. 21 కోట్ల మంది మెరుగైన పారిశుద్ధ్యాన్ని పొందలేకపోతున్నారు. సురక్షిత తాగునీరు లేకపోవడంతో నీటి ద్వారా అనేక సాంక్రిమిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు నదీతీరాల్లోని నగరాలు నదులను మురికి కూపాలుగా మార్చేసి నీటి వనరులను కాలుష్యంతో నింపేసి విషతుల్యంగా మార్చేస్తున్నాయి.

నీరు కేవలం తాగడానికి, వ్యవసాయానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక పురోగతిలో నీటి వనరుల లభ్యత అన్నదే అత్యంత కీలకాంశం. నీటి వనరులు లేని ఎడారి ప్రాంతాలకు, నీటి వనరులు పుష్కలంగా నదీతీర మైదాన ప్రాంతాలకు మధ్య తేడా గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. నీటి కొరత ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా వ్యవసాధారిత దేశమైన భారత్‌లో నీటి నిర్వహణ పద్ధతులు మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. వాతావరణ మార్పుల్లో భాగంగా దేశానికి నీటిని అందించే రుతుపవనాలు, వర్ష పాతాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అధిక వర్షాలు, వరదలు, అనావృష్టి వంటి అసమతౌల్యం పెరిగిపోతోంది. నెల రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షాలు ఒకట్రెండు రోజుల వ్యవధిలో కురవడం వల్ల ఆ నీరంతా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. లేదంటే అనావృష్టి ఏర్పడి భూములు బీటలు వారుతున్నాయి. ప్రభుత్వాలు ముందుచూపుతో ఇప్పటి నుంచే మెరుగైన నీటి నిర్వహణ పద్దతులను అవలంబించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రాల మధ్య తగవులకు కారణమవుతున్న జలవనరులను పూర్తిగా కేంద్రమే ఆధీనంలోకి తీసుకుని, నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కారణం ఇదే

తెలుగు రాష్ట్రాలకు నీటిని అందించే రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. వాటిలో నీటి ప్రవాహం నానాటికీ తగ్గిపోతుండగా.. భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోయాయి. వ్యవసాయానికి ప్రభుత్వాలు అందిస్తున్న “ఉచిత విద్యుత్తు” పాపమే ఇదంతా అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడిపడేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని సూత్రీకరిస్తున్నారు. మోటార్ పంప్ సెట్‌లకు ఆటోమేటిక్ స్టార్టర్‌లను అమర్చి మరీ రాత్రీ, పగలు తేడా లేకుండా నీటిని తోడేయడం వల్ల తాగడానికి నీటిని వెతుక్కోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకప్పుడు ఓ 50 అడుగుల లోతు కూడా లేని బావుల్లో నిండుగా నీరు కనిపించేది. ఇప్పుడు వందల కొద్దీ మీటర్ల లోతున బోరు బావులు తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. వరి వంటి అత్యధిక నీటి వినియోగం జరిగే పంటల సాగు ఎక్కువగా జరగడం కూడా మరో కారణం.

ప్రభుత్వాలు అందించే మద్దతు ధర కోసం రైతులు పంటల వైవిధ్యాన్ని వదిలేసి వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా అందుబాటులో ఉన్న నీటి వనరులన్నీ వరి సాగుకే ఖర్చు చేయాల్సి వస్తోంది. వరి నిల్వలు అవసరానికి మించి పెరిగిపోయి, ఇతర పంటలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నిపుణుల సూచన మేరకు వరి సాగును నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం చేసి, తక్కువ నీటిని వినియోగించే ఇతర ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనల సంగతెలా ఉన్నా.. నీటి కొరత ఏర్పడకుంటా ఉత్తమ నీటి నిర్వహణ పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే నీటి కొరతపై స్పృహ ప్రతి ఒక్కరికీ ఉండాలి. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అందరూ అలవర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు మనం జలవనరులను మిగల్చగల్గుతాం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
త్వరలో ఈ కంపెనీలకు కోట్లాభిషేకం.. ఐపీవోకు రంగం సిద్ధం..
త్వరలో ఈ కంపెనీలకు కోట్లాభిషేకం.. ఐపీవోకు రంగం సిద్ధం..
ఈరోజు రాత్రి 9:30 గంటల నుంచి మీ ఇంటి కరెంటు నిలిపివేత
ఈరోజు రాత్రి 9:30 గంటల నుంచి మీ ఇంటి కరెంటు నిలిపివేత
'డబ్బు'ల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు
'డబ్బు'ల బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వెలుగులోకి నయా మోసాలు
శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు
శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు
'ఆఫీసుకు రాకుండానే చాలామందికి జీతాలు..' లెక్కలు తేలుస్తోన్న సీఎం
'ఆఫీసుకు రాకుండానే చాలామందికి జీతాలు..' లెక్కలు తేలుస్తోన్న సీఎం
కలల ప్రాజెక్టులను సాకారం చేసేందుకు వడివడిగా సీఎం అడుగులు
కలల ప్రాజెక్టులను సాకారం చేసేందుకు వడివడిగా సీఎం అడుగులు
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌