AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holli Festival: ఆ గ్రామంలో వింత ఆచారం.. హోళీ పండుగపూట పిడిగుద్దులు .. ముష్టి ఘాతుకాలు!

హోళీ పండగు వచ్చిందంటే.. దేశమంతా రంగులు చల్లుకుంటారు.. సంబరాల్లో మునిగితేలుతారు.. కానీ అక్కడ మాత్రం ఒకరినొకరు కొట్టుకుంటారు. రక్తం కారేలా పిడిగుద్దులు గుద్దుతారు. మళ్లీ అలాయ్- బలాయ్ చేసుకుంటారు. కొట్టుకోవడం అక్కడి ప్రత్యేకత. హోళీ పర్వదినాన అలా కొట్టుకోకపోతే.. గ్రామానికి అరిష్టం జరుగుతుందని వారి విశ్వాసం. పోలీసులు వద్దనా.. సర్కారు అనుమతి లేకున్నా.. గ్రామస్ధులంతా ఒక్కచోట చేరి పిడిగుద్దులాటతో.. తన ప్రత్యేకతను చాటుతోంది ఆ గ్రామం.

Holli Festival: ఆ గ్రామంలో వింత ఆచారం.. హోళీ పండుగపూట పిడిగుద్దులు .. ముష్టి ఘాతుకాలు!
Fistfights
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 26, 2024 | 8:08 AM

Share

హోళీ పండగు వచ్చిందంటే.. దేశమంతా రంగులు చల్లుకుంటారు.. సంబరాల్లో మునిగితేలుతారు.. కానీ అక్కడ మాత్రం ఒకరినొకరు కొట్టుకుంటారు. రక్తం కారేలా పిడిగుద్దులు గుద్దుతారు. మళ్లీ అలాయ్- బలాయ్ చేసుకుంటారు. కొట్టుకోవడం అక్కడి ప్రత్యేకత. హోళీ పర్వదినాన అలా కొట్టుకోకపోతే.. గ్రామానికి అరిష్టం జరుగుతుందని వారి విశ్వాసం. పోలీసులు వద్దనా.. సర్కారు అనుమతి లేకున్నా.. గ్రామస్ధులంతా ఒక్కచోట చేరి పిడిగుద్దులాటతో.. తన ప్రత్యేకతను చాటుతోంది తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దులోని హున్సా గ్రామం. హోళీ సందర్భంగా ఆడిన పిడిగుద్దులాట అస‌క్తిక‌రంగా నిలుస్తుంది..

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో దేశంలో ఎక్కడా లేని విధంగా హోళీ పండగ రోజు పిడిగుద్దులాట నిర్వహించడం ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. 125 ఏళ్లుగా హోలీ రోజు గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. గ్రామ శ్రేయస్సు కోసం కుల, మత విభేదాలు లేకుండా ఐక్యత, ఆత్మీయతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ప్రతీ సంవత్సరం పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా గ్రామస్థులు మాత్రం ఇలా ఒక్కచోట చేరి హోళీ సందర్భంగా కొట్టుకుంటారు. పిడిగుద్దులాట చూసేందుకు.. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జనం హున్సా గ్రామానికి తరలివస్తారు. ఈసారి హోళీ పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొని పిడిగుద్దులాటను తిలకించారు. ఈ ఆట తమ సాంప్రదాయమని చెబుతున్నారు గ్రామస్ధులు.

ఉద‌యం హోళీ- సాయంత్రం పిడిగుద్దులు

హోళీ పండగ రోజు అందరిలాగే హున్సా గ్రామస్ధులు ఉదయం రంగులు చల్లుకున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించారు. సాయంత్రం గ్రామ చావిడి దగ్గర చేరుకుని, ఇదిగో ఇలా కొట్టుకున్నారు.

వీడియో చూడండి..

గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న హనుమాన్‌ మందిరం పిడిగుద్దులాటకు వేదికగా మారింది. గ్రామ పెద్దలు ఐక్యతతో ఈ వేడుక నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామ పెద్దలను డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడే రెండు వైపులా బలమైన కట్టెలు పాతి వాటి మధ్య తాడు కట్టారు..తర్వాత గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఇలా 15 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగింది. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మూతి పగిలినా.. నెత్తురు కారినా.. గుద్దుకోవడం ఆపలేదు. గాయాలకు కామ దహనానికి వినియోగించిన బూడిదను రాసుకుంటామని గ్రామస్ధులు చెబుతారు.

గుద్దుకున్న చోటే ఆలింగ‌నాలు

డప్పు వాయిద్యాలు, కేరింతలు మధ్య పిడుగుద్దులాట జరగడం ఆనవాయితీగా జరుగుతుందని గ్రామస్ధులు చెబుతున్నారు. పిడిగుద్దులాట అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పోలీసులు ఏటా ఆంక్షలు విధించినా.. భారీ బందోబస్తు మధ్య గ్రామస్ధులు కొట్టుకోవడం అనంతరం ఆలింగనం చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..